Top 6 News Of The Day: కూల్చివేతలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన హైడ్రా.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్

Top 6 News Of The Day: కూల్చివేతలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన హైడ్రా.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్
x
Highlights

1) కూల్చివేతలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటోన్న గృహాలను కూల్చబోమని...

1) కూల్చివేతలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన హైడ్రా

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటోన్న గృహాలను కూల్చబోమని మరోసారి హైడ్రా ప్రకటించింది. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో అనుమతులు లేకుండా ఇళ్లు, భవనాలు నిర్మిస్తున్నారని చెబుతూ.. కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నట్లు స్పష‌్టం చేసింది హైడ్రా. ఇప్పటికే నిర్మించి నివాసం ఉంటోన్న ఇళ్లను కూల్చివేయమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లో లేఔట్స్ వేసి అక్కడ నిర్మించే ఇళ్లు కొనుగోలు చేయొద్దని రంగనాథ్ ప్రజలకు సూచించారు.

2) ఏకకాలంలో హైడ్రా కూల్చివేతలు

మరోవైపు మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు ఉండగా.. చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ 15 ఎకరాల 20 గుంటలు. 2013లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసినప్పుడు....15 ఎకరాల 23 గుంటల్లో చెరువులో నీళ్లు ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలోనే సున్నం చెరువు చుట్టూ కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు FTLలో 12, 13, 14, 16 సర్వే నెంబర్లు ఉన్నాయి. పదుల సంఖ్యలో షెడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. భారీ పోలీస్ బందోబస్త్ నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అలాగే దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేట కత్వా చెరువులోని విల్లాలు, అమీన్‌పూర్ మునిసిపాలిటీలోని హెచ్ఎంటీ నగర్, వాణి నగర్ కాలనీల పరిధిలోని అక్రమ కట్టడాలను సైతం హైడ్రా కూల్చివేసింది.

3) హైడ్రాకు, రేవంత్ రెడ్డికి రాజా సింగ్ ఓపెన్ ఛాలెంజ్

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్న వేళ.. హైడ్రాను , సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైసీ కాలేజీకి నోటీసులు ఇచ్చారు.. కానీ ఇప్పటి వరకు కూల్చలేదని.. అసలు ఎప్పుడు కూలుస్తారో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఒవైసీ కాలేజ్‌ను హైడ్రా కూల్చితే సీఎం రేవంత్‌ రెడ్డి హీరో అవుతారని లేని పక్షంలో హైడ్రా విఫలమైనట్లేనని రాజా సింగ్ అన్నారు. నగరవ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూలుస్తున్న నేపథ్యంలో ఒవైసీ ఫాతిమా కాలేజ్‌‌ కూల్చివేతపై కూడా హైడ్రా, రేవంత్‌ రెడ్డి తేదీలు ప్రకటించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. హైడ్రాకు సంబంధించి వస్తోన్న విమర్శలు, వ్యాఖ్యలపై ఏదో ఒక సందర్భంలో స్పందిస్తూ వస్తోన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి ఈసారి రాజా సింగ్ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారోననే ఆసక్తి నెలకొంది.

4) ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. విజయవాడలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. విశాఖ, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు చేశారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావణ శాఖ.

5) సీఎం చంద్రబాబుకు జగన్ ట్వీట్

చంద్రబాబు గారూ... విజయవాడలో వరదలు వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్నా బాధితులకు.. ఇప్పటికీ దారీ తెన్నూ లేకుండాపోయింది. ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా..? లేదా..? అని అనిపిస్తోంది. వరదలకన్నా మీ నిర్వాకం వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. ఐడు కోట్ల మంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం ఐదారు లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ఉందా..? ఇంత చేతగాని తనమా..? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు గారూ... ఇది ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేసిన ట్వీట్. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) కార్గిల్ యుద్ధంలో పాకిస్తానీ సైన్యం పాత్ర.. ఒప్పుకున్న పాకిస్తాన్ జనరల్ సయ్యద్ ఆసిం మునీర్

కార్గిల్ యుద్ధంలో పాకిస్తానీ సైన్యం పాత్ర ఉందని తొలిసారిగా రావల్పిండిలోని ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయమైన జనరల్ హెడ్‌క్వార్టర్స్ (జీహెచ్‌క్యూ) వెల్లడించింది. పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ సయ్యద్ ఆసిం మునీర్ 1999 నాటి కార్గిల్ యుద్ధంలో పాక్ మిలటరీ ప్రత్యక్ష పాత్ర ఉందని అంగీకరించారు. శుక్రవారం నాడు పాకిస్తాన్‌లో ఢిపెన్స్ డే సందర్భంగా ఇచ్చిన ప్రసంగంలో మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధం, ఇంకా భారత్‌తో జరిగిన మూడు యుద్ధాలలో ప్రాణ త్యాగం చేసిన పాకిస్తానీ సైనికులకు గౌరవ వందనం చేస్తున్నట్లు ప్రకటించారని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. పూర్తి వార్తాకథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories