Top 6 News @ 6PM: మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదు: మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News of the day December 11th 2024
x

Top 6 News @ 6PM: మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదు: మరో 5 ముఖ్యాంశాలు

Highlights

మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై బుధవారం కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు.

1. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు

మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై బుధవారం కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు.జయసుధ పేరిట ఉన్న గోడౌన్ ఉంది. దీన్ని సివిల్ సప్లయిస్ శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇందులోని బియ్యం నిల్వల్లో తేడాలను అధికారులు గుర్తించారు. 185 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైనట్టు అధికారులు తేల్చారు.

2. మంచు మనోజ్ పై దాడి కేసులో విష్ణు ప్రధాన అనుచరుడు అరెస్ట్

మంచు మనోజ్ పై దాడి కేసులో విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్ ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. డిసెంబర్ 8న తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో వినయ్ రెడ్డి అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై మంచు మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇవాళ విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

3. కాబోయే కోడలికి కీలక బాధ్యతలు అప్పగించిన డోనల్డ్ ట్రంప్

తన కొడుకు జూనియర్ ట్రంప్ నకు కాబోయే భార్య కింబర్లీ గిల్ఫోయిను గ్రీస్ కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్టు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. 2025 జనవరి 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కింబర్లీ కొన్నేళ్లుగా తమ కుటుంబానికి సన్నిహితురాలిగా ఉన్నారని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. న్యాయ, మీడియా, రాజకీయాల్లో ఆమెకున్న అనుభవం ఇందుకు పనికొస్తుందని ఆయన చెప్పారు.2020 డిసెంబర్ 31న జూనియర్ ట్రంప్ తో ఆమెకు ఎంగేజ్ మెంట్ జరిగింది.

4. గీతా పారాయణానికి గిన్నిస్ రికార్డ్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్, ఉజ్జయినిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గీతా పారాయణానికి గిన్నిస్ రికార్డులో చోటు దక్కింది. 5 వేల మంది భక్తులు గీతా పఠనం చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. డిసెంబర్ 11 గీతా జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో మూడేళ్లలో గీతా భవన్ లు నిర్మిస్తామని ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం మోహన్ యాదవ్ చెప్పారు.

5. ఏపీలో హెల్మెట్ల వాడకపోవడంపై హైకోర్టు సీరియస్

ఏపీలో హెల్మెట్ల నిబంధన సరిగా అమలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.హెల్మట్లు లేని కారణంగానే 3 నెలల్లో 667 మంది మరణించడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని కోర్టు ప్రశ్నించింది.ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలుంటాయనే భయం ప్రజల్లో ఉండాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. చలాన్లు చెల్లించనివారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

6. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్ 30 నుంచి రోహిత్ శర్మ ఔట్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ 31 స్థానానికి రోహిత్ శర్మ దిగజారారు. ఆరు స్థానాలు దిగజారడంతో ఆయన 30 నుంచి 31 స్థానానికి పడిపోయారు. కోహ్లి ఐదు స్థానాలకు దిగజారి 20 వర్యాంకులో నిలిచారు. భారత్ జట్టు ఆటగాడు యశస్వి జైపాల్ నాలుగో స్థానంలో ఉన్నారు.రిషబ్ పంత్ 3 స్థానాలు కోల్పోయి 9వ స్థానానికి పడిపోయారు.శుభ్ మన్ గిల్ తన ర్యాంకింగ్ ను మెరుగుపర్చుకున్నారు. ఒక్క పాయింట్ సాధించి 17వ ర్యాంకులో నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories