Top 6 News Of The Day: పేర్ని నానికి ఘోర అవమానం.. మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News Of The Day: పేర్ని నానికి ఘోర అవమానం.. మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

1) మాజీ మంత్రి పేర్ని నానికి ఘోర అవమానం గుడివాడలో మాజీ మంత్రి పేర్నినానికి ఘోర అవమానం జరిగింది. కోడి గుడ్లతో జనసైనికులు దాడికి పాల్పడ్డారు. దీంతో...

1) మాజీ మంత్రి పేర్ని నానికి ఘోర అవమానం

గుడివాడలో మాజీ మంత్రి పేర్నినానికి ఘోర అవమానం జరిగింది. కోడి గుడ్లతో జనసైనికులు దాడికి పాల్పడ్డారు. దీంతో కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుడివాడలోని వైసీపీ నేత శివాజీ ఇంటికి పేర్ని నాని వెళ్లగా జనసైనికులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని జన సైనికులు డిమాండ్ చేశారు.

2) జగన్ మాదిరి తల్లినీ, చెల్లినీ రోడ్లపైకి..

గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు వైసీపీ సృష్టేనని ఆరోపించారు ఏపీ మంత్రి నారా లోకేష్. వారి హయంలో కుంభకోణాలను పక్కదారి పట్టించడానికే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని విద్యార్థుల బాధ్యత తనదేనన్నారు లోకేష్. జగన్ మాదిరి తల్లినీ, చెల్లినీ రోడ్లపైకి గెంటివేసే రకం కాదని విమర్శించారు. కాలేజీలో నలుగురు విద్యార్థుల మధ్య జరిగిన పర్సనల్ మ్యాటర్‌ను హిడెన్ కెమెరాలకు లింక్ చేస్తున్నారని అన్నారు. వివాదానికి కారణమైన విద్యార్థులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

3) నిండు కుండలా జలశయాలు

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండుకుండలా తలపిస్తుండడంతో అక్కడి ప్రాజెక్టుల అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 588.90 అడుగులకు చేరింది. దీనితో సాగర్ డ్యామ్ అధికారులు అప్రమత్తమై సాగర్ 26 క్రస్టుగేట్లు 14 గేట్లు 10 అడుగులమేర,12 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి 5,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

4) తీరం దాటిన వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటింది. ఛత్తీస్‌ఘడ్ - విదర్భ మీదుగా ప్రయాణించి వాయుగుండం బలహీన పడుతోంది. దక్షిణ ఓడిశా ఉత్తరాంధ్ర మధ్య ద్రోణి కొనసాగుతుండగా దీని ప్రభావంతో మరో 24గంటల పాటు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్‌ తెలపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏలూరు జిల్లాలోని రాములేరు వాగు పొంగడంతో వరద నీరు పలు గ్రామాల్లోని ఇళ్లల్లోకి ప్రవేశించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలిస్తామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు.

5) రేపు తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతానికి వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం రేపు (సెప్టెంబర్ 2) రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

6) తెలంగాణ హై అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అలర్టయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రులు భట్టి, ఉత్తమ్‌, పొంగులేటి, రాజనర్సింహ, తుమ్మల, జూపల్లితో ఫోన్‌లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అధికారులెవరూ సెలవులు పెట్టొద్దని, పెట్టినవారు వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే.. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంవో ఆఫీస్‌కు పంపాలని చెప్పారు. వరద ఎఫెక్ట్‌ ఏరియాల్లో తక్షణ సాయం కోసం చర్యలు చేపట్టాలన్న సీఎం.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ.. సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటకు రావొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. 24 గంటలు అలర్ట్‌గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు భాగం కావాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories