Top 6 News @ 6PM: HYDRA: కూల్చివేతల్లో బాధితులకు నష్టంపై హైడ్రా మరో కీలక నిర్ణయం.. మరో 5 ముఖ్యాంశాలు
1) Harish Rao: వై నాట్ వన్ నేషన్.. వన్ ఎంఎస్‌పీ.. గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా? Harish Rao: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై...
1) Harish Rao: వై నాట్ వన్ నేషన్.. వన్ ఎంఎస్‌పీ.. గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా?
Harish Rao: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం One Nation, One MSP అని ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతు పట్ల ఎందుకు వివక్ష చూపుతోందన్నారు. గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాల్‌కు 8 వేల 257 రూపాయలు చెల్లిస్తున్న కేంద్రం, తెలంగాణ పండిస్తున్న పత్తికి 7వేల 521 రూపాయలు మాత్రమే చెల్లించడం దుర్మార్గం అని అన్నారు.
"One Nation, One Tax."
— Harish Rao Thanneeru (@BRSHarish) October 17, 2024
"One Nation, One Election."
"One Nation, One Ration Card"
"One Nation, One Market."
అంటూ ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం,
One Nation, One MSP అని ఎందుకు ఇవ్వడం లేదు.
పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉంది.
నాణ్యమైన…
2) IAS Officers: ఏపీ సీఎస్‌కు రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు
IAS Officers: ఆమ్రపాలి సహా నలుగురు ఐఎఎస్ అధికారులు గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు రిపోర్ట్ చేశారు. ఏపీ రాష్ట్ర కేడర్ కు కేటాయించిన ఈ నలుగురు ఐఎఎస్ అధికారులు వాణీప్రసాద్, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలిలను తెలంగాణ నుంచి అక్టోబర్ 16న రిలీవ్ అయ్యారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లో చేరుతారని తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి ఏపీ సచివాలయానికి మెయిల్ పంపారు. మరోవైపు తెలంగాణ కేడర్ కు చెందినప్పటికీ ఏపీలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్, శివశంకర్ లు బుధవారం సాయంత్రమే తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి రిపోర్ట్ చేశారు.
3) Supreme Court: పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 6 ఎ ను సమర్థించిన సుప్రీంకోర్టు
Supreme Court: పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6ఎ రాజ్యాంగబద్దతను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం సమర్థించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 4:1 మెజారిటీతో తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ పార్థీవాలా మాత్రమే రాజ్యాంగవిరుద్దమని భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.
అక్రమ వలసలకు అస్సాం అకార్డ్ ఓ రాజకీయ పరిష్కారం.అదే సమయంలో సెక్షన్ 6 అనేది చట్టబద్దమైన మార్గం. ఈ నిబంధనలు రూపొందించడానికి మెజారిటీతో కూడిన పార్లమెంట్ కు శక్తి ఉంది.స్థానికుల ప్రయోజనాలకు కాపాడే సమతౌల్యత ఈ సెక్షన్ కు ఉంది. ఇక దీనిలోని కటాఫ్ డేట్ గా నిర్ణయించిన 1971 మార్చి 25 అనేది సరైంది. పౌరసత్వచట్టం 1955 సెక్షన్ 6 ఎ ప్రకారం 1966 జనవరి నుంచి 1971 మార్చి 25 లోపు అస్సాంకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చు. ఈ నిబంధనను 1985లో అస్సాం అకార్డ్ తర్వాత తీసుకువచ్చారు.
4) Supreme Court: సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్జిస్ సంజీవ్ ఖన్నా.. ఎవరీ సంజీవ్ ఖన్నా..?
Supreme Court: సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిగ్ గా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ ప్రతిపాదించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమతులయ్యే ఛాన్స్ ఉంది. ఈ మేరకు తన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లయితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులవుతారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) Heavy Rains: చిగురుటాకులా చెన్నై.. చెన్నై సహా 4 జిల్లాలకు కొనసాగుతున్న ఎల్లో అలర్ట్
Chennai Rains: వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై సహా 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. తూత్తూకుడి, తిరునల్వేలి జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంట 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో.. పోర్టు ప్రాంతాల్లో నాలుగో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో చెన్నైలోని పలు ఏరియాల్లో రికార్డు వర్షపాతం నమోదైందని ఐఎండీ ప్రాంతీయ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ముంచెత్తుతున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు డ్యాములు నిండుకుండల్లా మారుతున్నాయి. వర్షపునీరు రోడ్లపై పొంగిపొర్లడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. తిరువళ్లూరు, కాంచీపురం, మధురై సహా పలు ప్రాంతాల్లో వీధులను వరద ముంచెత్తింది. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరడంతో పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలకూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మత్స్యకారుల నివాసాల్లోకి సముద్రపునీరు చేరటంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
6) Hydra: హైడ్రా కూల్చివేతలపై మరో కీలక నిర్ణయం..బిల్డర్ల నుంచి బాధితులకు పరిహారం
Hydra: హైడ్రా కూల్చివేతలపై మరో కీలక నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం బిల్డర్ల నుంచి డబ్బులు రికవరీ చేసి బాధితులకు ఇప్పించాలని సర్కార్ భావిస్తోందని సమాచారం. కూల్చివేతల విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడం సరైంది కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బిల్డర్లు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మోసానికి పేదలు నష్టపోతున్నారని..చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ జోన్ అనేది తెలియకుండానే పేదలు బిల్డర్ల వద్ద నుంచి ఆ ఇళ్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire