Top 6 News @ 6pm: జీహెచ్ఎంసీ 4 ముక్కలవుతోందా? రేపు కోర్టుకు హాజరుకానున్న నాగార్జున.. మరో టాప్ 4 న్యూస్ హెడ్‌లైన్స్
1) TDP in Telangana: టీడీపీ పూర్వవైభవం కోసమేనా?: చంద్రబాబుతో మల్లారెడ్డి, తీగల భేటి మాజీ మంత్రి సి. మల్లారెడ్డి,ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే...
1) TDP in Telangana: టీడీపీ పూర్వవైభవం కోసమేనా?: చంద్రబాబుతో మల్లారెడ్డి, తీగల భేటి
మాజీ మంత్రి సి. మల్లారెడ్డి,ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును కలిశారు. ఈ బేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. హైద్రాబాద్ సుందర నగరంగా తీర్చిదిద్దడంలో తాను మేయర్ గా కీలకపాత్ర పోషించినట్టుగా తీగల కృష్ణారెడ్డి చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైబరాబాద్ సిటీ ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీన్ని ఎవరూ కాదనలేరు. బెస్ట్ సిటీ అవార్డు, బెస్ట్ టూరిజం అవార్డు కూడా హైద్రాబాద్ కు అప్పట్లో వచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు మేమంతా చంద్రబాబును కలిసినట్టు తీగల కృష్ణారెడ్డి తెలిపారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2) GHMC Into 4 Parts: నాలుగు ముక్కలుగా జీహెచ్ఎంసీ: కాంగ్రెస్ పట్టుకోసమేనా?
జీహెచ్ఎంసీని నాలుగు భాగాలుగా విభజిస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. జీహెచ్ఎంసీకి నలుగురు మేయర్లు, కమిషనర్లు ఉంటారని ఆయన చెప్పారు. మంత్రి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీశాయి. రాజకీయంగా జీహెచ్ఎంసీపై పట్టు సాధించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదన తెచ్చిందా అనే చర్చ కూడా ఉంది. అయితే ఈ చర్చలో వాస్తవం లేదని అధికార పక్షం కొట్టిపారేస్తోంది. కానీ అక్టోబర్ 4న హైద్రాబాద్‌లో జరిగిన అసోచామ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2024 సమావేశంలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో 1.5 కోట్ల జనాభా ఉంది. వచ్చే ఎన్నికల్లో జీహెచ్ఎంసీని నాలుగు జోన్లుగా విభజించి ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) Ratan Tata's Health Condition: ఆరోగ్య పరిస్థితి విషమం అనే వార్తలపై స్పందించిన రతన్ టాటా
రతన్ టాటా అనారోగ్యంపై మీడియాలో, సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ అయిన రతన్ టాటాను ఆయన కుటుంబసభ్యులు రాత్రి 12.30 -1 గంట మధ్య ప్రాంతంలో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారని... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందనేది ఆ వార్తల సారాంశం. ముఖ్యంగా రతన్ టాటా బీపీ బాగా పడిపోయిందని, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా షారుఖ్ అస్పి గోల్వాలా నేతృత్వంలోని నిపుణుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని వార్తలొచ్చాయి. తాజాగా రతన్ టాటా స్వయంగా ఈ వార్తలపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఆరోగ్యం విషమంగా ఉందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని రతన్ టాటా స్పష్టంచేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) Nobel prizes 2024: వైద్య రంగంలో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ ప్రైజ్.. వాళ్లు ఏం చేశారంటే..
వైద్య శాస్త్రంలో ప్రయోగాలు చేసిన అమెరికాకు చెందిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ ప్రైజ్ వరించింది. తమ ప్రయోగాలతో మైక్రో ఆర్ఎన్ఏని కనుగొన్నందుకు వీరికి జాయింట్‌గా నోబెల్ బహుమతి ప్రకటిస్తున్నట్లు స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ స్పష్టంచేసింది. జీన్ రెగ్యులేషన్‌లో ఈ సూక్ష్మ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) Konda Surekha: కొండా సురేఖ వివాదం.. రేపు కోర్టుకు హాజరుకానున్న నాగార్జున
మంత్రి కొండా సురేఖపై సినీ నటులు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు. రేపు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు తెలిపింది. రేపు కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్ట్ రేపటికి వాయిదా వేసింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Maldives President: ఢిల్లీకి వచ్చి 'డిప్లొమాటిక్ యూ టర్న్' తీసుకున్న మాల్దీవులు అధ్యక్షుడు మొహమెద్ ముయిజ్జు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమెద్ ముయిజ్జు ఇండియా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఇండియాకు వచ్చిన ముయిజ్జుకి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో సోమవారం మొహమెద్ ముయిజ్జు భారత దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, మొహమెద్ ముయిజ్జుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొహమెద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire