Top 6 News @ 6PM: టాటా ట్రస్టుల చైర్మన్‌గా రతన్ టాటా స్థానంలో నోయెల్ టాటా.. తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. మరో టాప్ 4 న్యూస్ హెడ్‌లైన్స్
1) కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో.. Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్య కన్నీరు...
1) కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో..
Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్య కన్నీరు పెట్టుకున్నారు. మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఇతర ప్రభుత్వ అధికారులు వచ్చి సర్వే చేసి పట్టా ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ కూలగొట్టారని మొగిలయ్య తెలిపారు. ఘటనపై ప్రభుత్వం స్పందించాలని మొగిలయ్య కోరారు. అధికారులు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
2) Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు ఆవర్తనాలు.. తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు
Rains Alert: ఉత్తర భారతం నుంచి ఈశాన్య రుతుపవనాలు మధ్య భారత్ కు తాకాయి. అవి సౌత్ కు వస్తే వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే అవి రాకుండా తెలుగురాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం పడుతుండటంతో ఇది కర్నాటక, గోవాకు దగ్గరలో ఉంది. రెండు రోజుల్లోనే వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అలాగే నైరుతీ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడగా..అది తమిళనాడు తీరానికి దగ్గర్లో ఉంది. అలాగే మరో ఆవర్తనం అక్టోబర్ 12న దక్షిణ బంగాళాఖాతానికి పశ్చిమం వైపున ఏర్పడే ఛాన్స్ ఉంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) Kali Temple Crown: బంగ్లాదేశ్‌లో ప్రధాని మోదీ కానుకగా సమర్పించిన కిరీటం చోరీ.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు
Crown Gifted By PM Modi Stolen In Bangladesh: ప్రధాని నరేంద్ర మోదీ 2021 లో బంగ్లాదేశ్ పర్యటనకి వెళ్లినప్పుడు అక్కడ సత్కిరా అనే ప్రదేశంలో ఉన్న జెశోరేశ్వరి కాళీ ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలోనే కాళీ ఆలయంలో అమ్మవారికి బంగారం, వెండితో రూపొందించిన కిరీటం బహుకరించారు. తాజాగా ఆ కిరీటం నిన్న గురువారం చోరీకి గురవడం సంచలనం సృష్టించింది. ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి, అమ్మవారికి భారత ప్రధాని మోదీ బహూకరించిన బంగారు, వెండి కిరీటాన్ని చోరీ చేశారు. ఆ దృశ్యాలు కాళీ మందిరంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) Maa Nanna Superhero Review: ఒక కొడుకు ఇద్దరు తండ్రుల ఎమోషనల్ జర్నీ..!
Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు ఇటీవల యాక్షన్ చిత్రాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను పలకరించాడు. అయితే చాలా రోజుల తర్వాత ఓ ఎమోషనల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే మా నాన్న సూపర్ హీరో. దసరా కానుగా అక్టోబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సరికొత్త పంథాలో వచ్చిన సుధీర్ బాబు ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకున్నాడు. మా నాన్న సూపర్ హీరో మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. మా నాన్న సూపర్ హీరో మూవీ ఫుల్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) IND vs BAN 3rd T20I: మూడో టీ20లో కీలక మార్పులు.. ప్రయోగాలకు సూర్యకుమార్ సిద్ధం.. వాళ్లపై వేటు?
India vs Bangladesh 3rd T20I Probable Playing-11: భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో చివరి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్లేయింగ్-11లో కొన్ని మార్పులు చేయవచ్చు. భారత్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడంపైనే ఆ జట్టు దృష్టి ఉంది. భారత్ సిరీస్‌ని చేజిక్కించుకుంది. కాబట్టి సూర్యకుమార్ కొన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Noel Tata: టాటా ట్రస్టుల చైర్మన్‌గా రతన్ టాటా స్థానంలో నోయెల్ టాటా
Who is Noel Tata: టాటా ట్రస్టుల చైర్మన్‌గా రతన్ టాటా స్థానంలో ఆయన సోదరుడు నోయెల్ టాటా నియమితులయ్యారు. రతన్ టాటాకు నోయెల్ టాటా హాఫ్ బ్రదర్ అవుతారు. అంటే రతన్ టాటా తల్లిదండ్రులు విడిపోయిన తరువాత తన తండ్రి నావల్ టాటా మరో పెళ్లి చేసుకున్నారు. అలా తన పిన తల్లి సైమన్ టాటాకు పుట్టిన కుమారుడే ఈ నోయెల్ టాటా. ఇప్పటికే టాటా గ్రూపులోని కొన్ని సంస్థల్లో నోయెల్ టాటా ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. ట్రెంట్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలకు నోయెల్ టాటానే చైర్మన్‌గా ఉన్నారు. అలాగే, టాటా ఇంటర్నేషనల్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా టాటా స్టీల్, టైటాన్ కంపెనీలకు వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire