Bharat Bandh: రేపు భారత్‌ బంద్‌

Tomorrow Bharat Bandh
x

భారత్ బంద్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Bharat Bandh: నూతన సాగు చట్టాలకు నిరసనగా భారత్‌ బంద్‌

Bharat Bandh: నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో పలు ధపాలు చర్చలు జరిపినప్పటికీ ఆచర్చలు విఫలమయ్యాయి. మరోవైపు.. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత రైతు సంఘాల సమన్వయ సమితి ఈనెల 26న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇక ఈ బంద్‌కు అన్నీ పార్టీలు మద్దతు తెలపాలని వామపక్ష నేతలు కోరారు.

ఇదిలా ఉంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్‌ 8న రాస్తారోకో నిర్వహించిన టీఆర్ఎస్‌ పార్టీ, యూ టర్న్‌ ఎందుకు తీసుకుంది ప్రశ్నించారు సీపీఐ నేతలు. వ్యవసాయ చట్టాలు కేవలం రైతులకు సంబంధించిన అంశమే కాదని రాష్ట్ర హక్కులకు సంబంధించిన అంశమన్నారు. అదేవిధంగా విద్యుత్‌ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలని, పంటకు మద్దతు ధరను చట్టం చేయాలనే అంశంపై పోరాడాలని గుర్తు చేశారు.

ఇక రైతు సమస్యల పరిష్కారంపై మోడీ ప్రభుత్వం మొండీగా వ్యవహరిస్తోందని వామపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడమేగాక.. అంబానీ, ఆదానీలకు పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. రేపు తలపెట్టిన భారత్‌బంద్‌ను జయపద్రం చేస్తామన్నారు. అటు నూతన వ్యవసాయ చట్టాలను తిప్పి కొట్టేందుకు ప్రజలంతా బంద్‌లో పాల్గొనాలని విజ్నప్తి చేశారు. రేపటి భారత్‌బంద్‌కు వామపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories