భారత్‌లో పెరుగుతున్న టమాటా ఫ్లూ కేసులు

Tomato flu Cases on the Rise in India
x

భారత్‌లో పెరుగుతున్న టమాటా ఫ్లూ కేసులు

Highlights

Tomato Flu: ఒడిశాలో 26 మంది చిన్నారులకు సోకిన టమాటా ఫ్లూ

Tomato Flu: భారత్‌లో టమాటా ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో ఈ ఏడాది మే 6న తొలి కేసు కేరళలో నమోదైంది. తాజాగా ఒడిశాలో 26 మంది చిన్నారులకు టమాటా ఫ్లూ సోకింది. ఈ వివరాలను లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ తెలిపింది. వారంతా 1 నుంచి 9 ఏళ్ళ మధ్య వయసు ఉన్న చిన్నారులేనని పేర్కొంది. దేశంలో ఈ వైరస్ సోకిన చిన్నారుల సంఖ్య ఇప్పుడు 82కి చేరింది. టమాటా ఫ్లూ సోకిన చిన్నారులు తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు, వాపు, దద్దుర్లతో బాధపడుతున్నారు.

టమాటా ఫ్లూపై భారత్‌లో అప్రమత్తత అవసరమని ప్రముఖ ది లాన్సెట్‌ జర్నల్ హెచ్చరించింది. కేరళలో ఈ కేసులు బయటపడడంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌లో ఇప్పటివరకు కేరళ, ఒడిశా, తమిళనాడులో మాత్రమే ఇప్పటివరకు ఈ కేసులు బయటపడ్డాయి. టమాటా ఫ్లూ ఓ అంటువ్యాధి. ఇది పేగు సంబంధిత వ్యాధి కారణంగా సోకుతుంది.

చిన్నారుల్లోనే టమాటా ఫ్లూ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ను తట్టుకునే శక్తి పెద్ద వారిలో ఉంటుంది. కాబట్టి వారిలో ఈ వైరస్ కనపడట్లేదు. ఈ ఇన్ఫెక్షన్‌కు టమాటాలకు ఎటువంటి సంబంధం లేదు. అయితే, ఈ ఇన్ఫెక్షన్ సోకిన చిన్నారుల శరీరంపై దద్దుర్లు ఎర్ర రంగులో నీటి బుడగల్లా ఏర్పడి, టమాటా సైజులో పెరుగుతున్నాయి. దీంతో ఈ ఇన్ఫెక్షన్ కు టమాటా ఫ్లూ అని పేరు పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories