Toll Gates: త్వరలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్లు

Toll Gates on Highways to go Modi Government to Launch GPS - Based Collection Soon
x

Toll Plaza:(ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

Toll Gates: టోల్‌ప్లాజాల స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని గడ్కరీ తెలిపారు.

Toll Gates: త్వరలో దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని వాటి స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమయంలో వెల్లడించారు. ''ఏడాది కల్లా దేశంలోని అన్ని టోల్‌బూత్‌లను తొలగిస్తామని సభా వేదికగా హామీ ఇస్తున్నా. అంటే ఇకపై జీపీఎప్‌ ఆధారంగా టోల్‌ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్‌ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం'' అని గడ్కరీ వివరించారు.

93శాతం ఫాస్టాగ్‌ ద్వారానే చెల్లింపులు...

ఇపుడు దేశవ్యాప్తంగా 93శాతం వాహనదారులు ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ చెల్లిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. అయితే మిగతా 7శాతం మంది మాత్రం రెట్టింపు టోల్‌ కడుతున్నా ఫాస్టాగ్‌ ఉపయోగించడం లేదని చెప్పారు. ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 16 నుంచి అన్ని జాతీయ రహదారులపై వీటి వినియోగాన్ని తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్‌ లేని వారి నుంచి రెట్టింపు టోల్‌ వసూలు చేస్తున్నారు.

జీపీఎస్‌ సాంకేతిక పరిజ్ఞానం...

అయితే ఇప్పుడు అన్ని వాహనాల్లో వెహికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ వస్తున్నందున.. టోల్‌ వసూలుకు కూడా జీపీఎస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన పనిలేకుండా జీపీఎస్‌ ఆధారంగా టోల్‌ చెల్లించే సదుపాయాన్ని తీసుకొస్తోంది. జీపీఎస్‌ ఆధారంగా...వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ గతంలో వెల్లడించారు. ఈ విధానం వల్ల జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్‌ ఛార్జీలను వసూలు చేయబడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories