ముంబైలో ఇవాళ రెండోరోజు ఇండియా కూటమి సమావేశం

Today is the Second day of the India Alliance Meeting in Mumbai
x

ముంబైలో ఇవాళ రెండోరోజు ఇండియా కూటమి సమావేశం

Highlights

Mumbai: కూటమి లోగోను ఆవిష్కరించనున్న నేతలు

Mumbai: మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి నేతలు.. సెప్టెంబరు 30కల్లా సీట్ల సర్దుబాటుపై తుదినిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చారు. గురువారం ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో సమావేశమైన ఇండియా నేతలు.. ఇవాళ జరగబోయే సమావేశానికి ఎజెండా ఖరారు చేశారు. కూటమికి కన్వీనర్‌ ఉండాలా వద్దా? సీట్‌ షేరింగ్‌పై సబ్‌గ్రూపులను ఏర్పాటు చేయాలా? అనే అంశాలతోపాటు విపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాల గురించి, కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పనపైన ఇవాళ్టి భేటీలో చర్చించనున్నారు. 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు గురువారంనాటి భేటీకి హాజరుకాగా అందులో పలువురు నేతలు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

తుది నిర్ణయం ఆధారంగా అన్ని పార్టీల రాష్ట్ర కమిటీలూ సీట్ల సర్దుబాటు ఫార్ములాను అమలు చేయనున్నాయి. ఇవాళ్టి భేటీ అనంతరం.. కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన 11 మంది నేతలతో కో-ఆర్డినేషన్‌ కమిటీని ప్రకటించడంతో పాటు కూటమి లోగోను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇండియా కూటమిలో ఇన్నాళ్లుగా 26 పార్టీలు ఉండగా.. గురువారంనాటి భేటీకి మరో రెండు పార్టీలు కొత్తగా హాజరయ్యాయి. వాటిలో ఒకటి పీడబ్ల్యూపీ కాగా.. మరొకటి మహారాష్ట్రలోని మార్క్సిస్ట్‌ పొలిటికల్‌ పార్టీ. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ‘అసోం జాతీయ పరిషత్‌’, ‘రైజోర్‌ దళ్‌’, ‘ఆంచలిక్‌ గణ్‌ మంచ్‌ భుయాన్‌’ కూడా ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నాయి. వాటి చేరికపై కూటమి నేతలు ఇవాళ్టి సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories