Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Today Gold Rates, Silver Price 23rd-April-2021
x

Gold Rate:(File Image)

Highlights

Gold Price Today: నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Price Today: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పసిడి ధరలు పెరిగాయి. దీంతో దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 50 రూపాయల మేర పెరిగింది. గురువారం 45,200 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు శుక్రవారం 45,250 గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో కూడా బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 60 మేర పెరిగింది. నిన్న రూ.46,590 ఉన్న ధర ఈ రోజు 46,650 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 50,850 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 45,250 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,250 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,100 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,200 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,200 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,200 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,200 వద్ద కొనసాగుతోంది.

పెరిగిన వెండి ధరలు...

దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు కలుగుతుంటాయి. గురువారం లాగానే… శనివారం కూడా వెండి ధరలు పెరిగాయి. కిలో వెండి ధర శుక్రవారం 68,800 ఉండగా.. శనివారం ఏకంగా 70,300లకు పెరిగింది. అంటే మరో 1,500 రూపాయలు అదనంగా పెరిగింది.

ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 70,300 లుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.70,300 ఉంది. చెన్నైలో రూ.75,700 ఉంది. కాగా ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది. బెంగళూరులో రూ.70,300 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.70,300 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో వెండి కిలో రూ.73,900 లు ఉంది. విజయవాడలో వెండి రూ.75,700 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 23-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.


Show Full Article
Print Article
Next Story
More Stories