Bengal: ఇవాళ తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధం

Today First Phase of Elections in Bengal
x

Representational Image

Highlights

Bengal: తూర్పు భారతంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బెంగాల్లోనూ, అసోంలోనూ ఇవాళ తొలిదశ పోలింగ్‌

Bengal: బ్యాలెట్‌ యుద్ధం నేటి నుంచే ప్రారంభంకానుంది. తూర్పు భారతంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బెంగాల్లోనూ, అసోంలోనూ ఇవాళ తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల దాకా ఓటింగ్ జరగనుంది. బెంగాల్లో మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతం జంగల్‌మహల్‌ కిందకు వచ్చే జిల్లాలు- పురులియా, బంకురా, పశ్చిమ మిడ్నపూర్, తూర్పు మిడ్నపూర్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లోనే జరుగుతున్నా నువ్వా నేనా అన్నరీతిలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ తలపడుతున్నాయి. పురులియాలో 185, ఝార్ర్గామ్‌లో 144 కంపెనీల కేంద్ర బలగాలను గస్తీకి దింపారు. ప్రతీ ఎన్నికా హోరాహోరీయే అయినా ఈ దఫా చాలా కీలకంగా మారింది పరిస్థితి. అటు బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ కొట్టాలని రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.

బెంగాల్‌ను ఎలాగైనా గెలిచి- విపక్షం మళ్లీ తలెగరేయకుండా చేసి- తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు. ఇద్దరికీ ఇది అగ్నిపరీక్షే. తూర్పు భారతాన బీజేపీకి వశం కానివి ఒడిషా, బెంగాల్‌ మాత్రమే. బెంగాల్‌ కమలనాథులకు మరీ కీలకం. బెంగాల్లో మొత్తం 294 సీట్లకుగాను 65 నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు ఎక్కువ. రాష్ట్ర ఓటర్లలో మూడో వంతు ముస్లింలే.

బీజేపీ గత మూడు నాలుగేళ్లుగా బెంగాల్లో తీవ్రంగా హిందూత్వ ఎజెండాను ప్రచారం చేస్తోంది. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లింలందరినీ చొరబాటుదారులంటూ వారిని ఏరిపారేస్తామని, సొనార్‌ బంగ్లా తెస్తామని హామీ ఇస్తోంది. సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేస్తామంటోంది. మమత దీనిని ధాటిగా కౌంటర్‌ చేసి అందుకు భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. వాటిని అమలు చేయనీయబోమని తేల్చిచెప్పారు. దీంతో ఈ ఎన్నికలు హిందూత్వ, నాన్‌ హిందూత్వ మధ్య సమరంగా మారాయి.

ఇక అసోంలో ముఖ్యమంత్రి శర్వానంద సొనొవాల్‌, స్పీకర్‌ హితేంద్రనాథ్‌ గోస్వామి, పీసీసీ అధ్యక్షుడు రిపున్‌ బోరా, అనేకమంది మంత్రుల భవితవ్యం శనివారం ఈవీఎంల్లోనిక్షిప్తమవుతుంది. బీజేపీ-ఏజీపీ కూటమికి, కాంగ్రెస్‌ సారథ్యంలోని 8పార్టీల మహాకూటమికి మధ్యే ప్రధాన పోటీ అయినా కొత్తగా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీ-అసొం జాతీయ పార్టీ, దాని మిత్రపక్షం రైజోర్‌ దళ్‌ ఈ రెండు కూటములు అభ్యర్థుల విజయావకాశాలకు గండికొట్టే అవకాశాలున్నా యి. ఏజేపీ-రైజోర్‌ దళ్‌ రెండూ అసొం జాతీయవాదా న్ని ముందుకు తీసుకెళుతున్న పక్షాలు. కాంగ్రెస్‌ కూటమిలో ఏఐయూడీఎఫ్‌ ఉండడంతో మెజారిటీ ముస్లిం ఓట్లు ఆ కూటమికి పడే అవకాశం ఉందంటున్నారు. మిగిలినవి ఏజేపీ-- రైజోర్‌ దళ్‌ జోలెలో పడతాయని అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories