Jairam Ramesh: ఇండియా కూటమిలో TMC ఉండాలనే మేం కోరుకున్నాం

TMC Shock To India Alliance In West Bengal
x

Jairam Ramesh: ఇండియా కూటమిలో TMC ఉండాలనే మేం కోరుకున్నాం

Highlights

Jairam Ramesh: సీట్ల విషయంలో చాలా సార్లు చర్చకు పిలిచాం

Jairam Ramesh: 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న TMC పశ్చిమబెంగాల్‌ పొత్తుల వ్యవహరంలో కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపింది. తాము ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతామని TMC స్పష్టం చేసింది. 42 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. అభ్యర్థుల జాబితాలో డైమండ్ హార్బర్ నుంచి అభిషేక్ బెనర్జీకి టిక్కెట్ లభించగా, కృష్ణానగర్ నుంచి తిరిగి టీఎంసీ లోక్‌సభ బహిష్కృత నేత మహువా మొయిత్రాకు ఆపార్టీ టిక్కెట్ కేటాయించింది.

కాగా, కోల్‌కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మమతా బెనర్జీ శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారం రోజే 42 మంది అభ్యర్థులను ప్రకటించి.. ఇండియా కూటమికి భారీ షాక్ ఇచ్చారు. తాజాగా ప్రకటించిన లిస్ట్‌లో క్రికెటర్ యూసుఫ్ పఠాన్, సినీనటుడు శత్రుఘ్నసిన్హాలకు కూడా చోటు దక్కింది.

అయితే.. ఇండియా కూటమిలో TMC ఉండాలని తాము ఎప్పుడూ కోరుకున్నామని.. సీట్ల విషయంలోనూ చాలా సార్లు చర్చించుకున్నామని.. కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు. అయితే.. ఆ రాష్ట్రంలో పరిస్థితులు దీదీ నిర్ణయానికి కార‌ణం అయ్యిండొచ్చన్నారు. అయినా.. తమ కూటమి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని.. తర్వాతి రోజుల్లో ఏం జరగబోతుందో చూద్దాం.. అంటూ జయరాం రామేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories