Delhi: ఢిల్లీలో గంట గడిస్తే చాలు వెయ్యికిపైగా కొత్త కేసులు

Thousand Corona Positive Cases Reporting in Delhi In one Hour
x

కరోనా వైరస్ 

Highlights

Delhi: దేశవ్యాప్తంగా కోటిన్నర దాటిన కేసులు * మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919

Delhi: దేశ రాజధాని ఢిల్లీని కరోనా దడదడలాడిస్తోంది. కరోనా కట్టడి కంట్రోల్‌ తప్పింది. కేసులు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాత్రి నుంచి వచ్చే 26 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఢిల్లీలో వీకెండ్‌ లాక్‌డౌన్‌ నిర్వహిస్తున్నారు. పైగా నైట్‌ కర్ఫ్యూను కూడా పాటిస్తున్నారు. ఐనా కేసులు కంట్రోల్‌ అవ్వకపోవడంతో పూర్తి కర్వ్యూ పాటించక తప్పదని ఢిల్లీ ప్రభుత్వం డిసైడ్‌ అయ్యింది. అనుకున్నదే తడవుగా వారం రోజుల పాటు కర్ఫ్యూను కన్‌ఫాం చేసింది.

ఢిల్లీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు వేలాదిగా వెలుగులోకి వస్తున్నాయి. గంట గడిస్తే చాలు కొత్తగా వెయ్యి కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ముగ్గురికి టెస్ట్‌ చేస్తే ఒక్కరికి ఖచ్చితంగా కరోనా ఉంటుంది. నిన్న ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 25,462 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఈ రెంజ్‌లో కేసులు నమోదవ్వడంతో ఇదే తొలిసారి. గడిచిన 24 24 గంటల్లో 167 మంది బలయ్యారు. దీంతో కరోనా కేసుల కట్టడి కోసం చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. అత్యధికంగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు.

కరోనా దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది. రోజుకి 60 వేల నుంచి 70 వేల కొత్త కరోనా కేసులు నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆస్పత్రిలో బెడ్లు దొరక్క.. సరైన చికిత్స అందక కరోనా రోగులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు పెరుగుతున్న మరణాల సంఖ్య మహారాష్ట్రను భయపెడుతోంది. ఒక్క ఆదివారమే 68వేల 631 కేసులు నమోదయ్యాయి. నిన్న 503 మంది మహమ్మారికి బలయ్యారు.

మహారాష్ట్ర, ఢిల్లీలోనే కాదు దేశమంతటా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఐదు రోజులుగా ప్రతిరోజూ 2లక్షల 50వేలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 2లక్షల 73వేలకుపైగా కేసులు కన్‌ఫాం అయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 1వెయ్యి 6వందల 19 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కోటిన్నర మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది. ఇటు కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలుచోట్ల లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories