కోబ్రా దాహార్తిని తీర్చిన దీపక్..

కోబ్రా దాహార్తిని తీర్చిన దీపక్..
x
Highlights

ఫోటో రాజస్థాన్ లోని బార్మెర్ ప్రాంతంలో తీసినది. రుతుపవనాలు దేశవ్యాప్తంగా ఆవహించాయి. వీటి ప్రభావంతో రాజస్థాన్ లో కూడా వర్షాలు పడుతున్నాయి.



రుతుపవనాలు దేశవ్యాప్తంగా ఆవహించాయి. వీటి ప్రభావంతో రాజస్థాన్ లో కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ లోని బార్మెర్లో మాత్రం వర్షం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఎండలు కూడా ఇక్కడ మండిపోతున్నాయి. ప్రస్తుతం ఎండ తీవ్రంత 42 డిగ్రీలకు చేరుకుంటుంది. ఈ క్రమంలో మండుతున్న వేడిలో, ప్రజా జీవితం చెదిరిపోతుంది, అలాగే వన్యప్రాణులు కూడా నీళ్లు లేక ఎండకు అల్లాడిపోతున్నాయి..

ఈ నేపథ్యంలో బార్మెర్‌లో పాములను రక్షించే దీపక్ సేన్ నీటిలో ఒక కోబ్రాను చల్లబరచడానికి ప్రయత్నిస్తున్నాడు. తన ఇంటికి సమీపంలో ఆ పాముకు స్వయంగా నీటిని తాగించాడు. అనంతరం ఆ పామును జనసంచారం లేని ప్రాంతంలో వదిలేశాడు. తన నివాస ప్రాంతంలో వందలాది పాములను దీపక్ పట్టుకుని సురక్షితమైన ప్రదేశాల్లో వదిలివేస్తున్నాడు. ఇలా చేయడం తనకు అలవాటని చెబుతుంటాడు. తాను ఎప్పుడైనా, ఎక్కడైనా పాములు పడితే వాటిని చంపకుండా జనసంచారం లేని ప్రాంతాల్లో వదిలిపెడతానని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories