Third Wave: మహారాష్ట్రలో థర్డ్‌వేవ్ వచ్చినట్లేనా?

Third Wave of Corona More Than 8000 Children Test Positive
x

Third Wave:(File Image)

Highlights

Third Wave: మహారాష్ట్రలో అహ్మద్ న‌గ‌ర్ జిల్లాలో 8 వేల మందికి పైగా చిన్నారులకు కోవిడ్‌ సోకింది.

Third Wave: మహారాష్ట్రలో థర్డ్ వేవ్ వచ్చినట్లేనా అంటే అవును అనే సమాధానం వస్తోంది. కారణం. అహ్మద్ న‌గ‌ర్ జిల్లాలో 8 వేల మందికి పైగా చిన్నారులకు కోవిడ్‌ సోకింది. దీంతో వారికి చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. అయితే కరోనా థర్డ్ వేవ్ వచ్చిందా లేదా అనేది ఇంకా పరిశీలిస్తున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ఐదుగురు పిల్లలు చికిత్స పొందుతున్నారు. సెకండ్ వేవ్ ఉధృతి కొంత తగ్గుతోంది అని ఆనందించే లోపే థర్డ్ వేవ్ పెనుముప్పు ముంచుకొస్తోంది.

థర్డ్‌వేవ్‌ గురించి స్థానిక కార్పొరేటర్ అభిజిత్ భోశ్లే మాట్లాడుతూ.. మే నెల‌లో 8వేల మంది చిన్నారుల‌కు క‌రోనా సోకిందని తెలిపారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వైర‌స్ సోకిన చిన్నారుల‌కు చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ వాతావ‌ర‌నాన్ని తలపించేలా క‌రోనా వార్డులను సిద్ధం చేస్తున్నామ‌ని చెప్పారు. 'జిల్లాలోని చిన్నారుల్లో 10శాతం మందికి కరోనా కేసులు నమోదయ్యాయని, అందుకే థర్డ్‌ వేవ్ నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చిన్న పిల్లల వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని' అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

థర్డ్ వేవ్ లో చిన్నారులను కరోనా టార్గెట్ చేస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీచేయడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారులు వైరస్ బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని రాష్ట్రాల్లో థర్డ్‌వేవ్ క్రమంగా వ్యాప్తిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories