Arvind Kejriwal: నేను తప్పు చేశాననడానికి ఎలాంటి ఆధారాలు లేవు

There Is No Evidence That I Have Done Anything Wrong Says Arvind Kejriwal
x

Arvind Kejriwal: నేను తప్పు చేశాననడానికి ఎలాంటి ఆధారాలు లేవు

Highlights

Arvind Kejriwal: ఈడీ నన్ను అరెస్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది

Arvind Kejriwal: కేజ్రీవాల్ రిమాండ్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టులో తన తరపున తానే సొంతంగా వాదనలు వినిపిస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈడీ తనను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు కేజ్రీవాల్. వంద కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈడీ వాదిస్తుందని.. అవినీతి జరిగితే వంద కోట్లు ఎక్కడ వెళ్లాయో ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తాను తప్పు చేశానని చెప్పడానికి ఆధారాలు లేవని.. అలాంటపుడు ఎలా అరెస్ట్ చేస్తారన్నారు. లిక్కర్‌ స్కాంలో నిందితుడిగా ఉన్న శరత్‌ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాక బీజేపీకి 50 కోట్ల బాండ్ రాసిచ్చారని..

లిక్కర్ స్కాం లావాదేవీలకు బీజేపీకి సంబంధం ఉందని కోర్టుకు తెలిపారు. అయితే కేజ్రీవాల్ వాదనలను ఈడీ వ్యతిరేకించింది. 50 కోట్ల బాండ్‌కు, లిక్కర్ స్కాంకు సంబంధం లేదన్నారు ఈడీ తరపు లాయర్‌. గోవా ఎన్నికల్లో హవాలా ద్వారా డబ్బులు తరలించిన ఖర్చు చేసినట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని.. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు తమకు అన్ని హక్కులు ఉన్నాయని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories