Aadhaar Card: ఆధార్‌ కార్డు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

There are four types of Aadhaar cards do you know which of these is yours
x

Aadhaar Card: ఆధార్‌ కార్డు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Highlights

Aadhaar Card: ఆధార్‌ కార్డు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Aadhaar Card: గత కొన్ని రోజులుగా ఆధార్‌ కార్డు ఎంత ముఖ్యమైన పత్రంగా మారిందో అందికి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఆధార్‌ కార్డు లేనిది దాదాపు ఏ పని జరగదు. పిల్లలను స్కూలు, కాలేజీల్లో చేర్చుకోవడం, బ్యాంకు ఖాతా తెరవడం, ప్రయాణ సమయంలో, హోటల్ బుకింగ్, ఆస్తులు కొనుగోలు చేయడం, మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి వాటికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. సామాన్యులు ప్రభుత్వ పథకాలకి అర్హులు కావాలన్ని ఆధార్‌ కార్డు కావాల్సిందే. ఆధార్‌ లేనిదే ఏ పని జరగదు. ఇది నాలుగు రకాలుగా ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. ఆధార్ లెటర్

ఆధార్ లెటర్ పౌరులందరి ఇంటికి యుఐడిఎఐ ద్వారా పంపుతారు. ఇది మందపాటి ఆధార్ కార్డ్, దీనిలో మన సమాచారం మొత్తం ఉంటుంది. ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ కార్డును తయారు చేసిన తర్వాత యుఐడిఎఐ ఈ ఆధార్ కార్డును ఇంటి చిరునామాకు పంపుతారు.

2. ఎం-ఆధార్ కార్డ్ (mAadhaar)

ఎం ఆధార్ కార్డ్ అనేది ఒక మొబైల్ యాప్. దీని ద్వారా ఆధార్ కార్డ్ సాఫ్ట్ కాపీ రూపంలో సురక్షితంగా ఉంటుంది. మీరు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఆధార్ వివరాలను నమోదు చేసి మీ ఆధార్‌ను సేవ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో ఎలాంటి అప్‌డేట్ చేసినా, MAadhaar కార్డ్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

3. పివిసి ఆధార్ కార్డ్

పివిసి ఆధార్ కార్డ్ ఎటిఎం కార్డ్ లాగా కనిపిస్తుంది. ఈ ఆధార్ కార్డ్ ప్రత్యేక ఆర్డర్ ద్వారా తయారు చేస్తారు. ఈ ఆధార్ కార్డ్‌లో డిజిటల్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఇందులో మీ మొత్తం సమాచారం ఉంటుంది. రూ.50 ఫీజు చెల్లించి యుఐడిఎఐ(UIDAI) అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ కార్డ్‌ కోసం ఆర్డర్ చేయవచ్చు. దీన ప్రత్యేకత ఏంటంటే ఈ కార్డు నీటిలో తడవదు, చిరిగిపోదు.

4. ఈ-ఆధార్ కార్డ్

ఈ-ఆధార్ కార్డు అనేది ఎలక్ట్రానిక్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఈ కార్డ్‌లో సురక్షితమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కార్డ్ పాస్‌వర్డ్‌తో భద్రపర్చినందు వల్ల ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరమవుతుంది. యుఐడిఎఐ ఈ ఆధార్ కార్డ్‌ను సురక్షితంగా ఉంచేందుకు మాస్క్డ్ ఈ-ఆధార్ కార్డ్‌ని జారీ చేస్తుంది. ఈ కార్డ్‌లో చివరి నాలుగు సంఖ్యలు మాత్రమే పేర్కొంటారు. దీంతో మీ ఆధార్ కార్డు డేటా దొంగిలించడానికి ఎటువంటి అవకాశం ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories