Women Reservation Bill: ఇవాళ రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు

The Women Reservation Bill Is Before The Rajya Sabha Today
x

Women Reservation Bill: ఇవాళ రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు

Highlights

Women Reservation Bill: రాజ్యసభలో ఆటంకాలు ఉండకపోవచ్చని భావిస్తున్న కేంద్రం

Women Reservation Bill: ఎట్టకేల‌కు మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. నేడు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు.. ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా ఆమోదం లభించింది. బిల్లుకు మెజార్టీ సభ్యులు ఆ​మోదం తెలిపారు. ఓటింగ్‌ సమయంలో 456 మంది సభ్యులు సభలో ఉన్నారు. అనుకూలంగా 454 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం ఎంపీలిద్దరూ వ్యతిరేకంగా ఓటేశారు.

2003లో వాజ్‌పేయి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో బిల్లు ఆమోదం పొందలేదు..2010లో యూపీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు తాము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ బెదిరించాయి. ఆ తర్వాత బిల్లుపై ఓటింగ్‌ వాయిదా పడింది. తరువాత అదే ఏడాది మార్చి 9 రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 186 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఒక్కరు ఓటు వేశారు. బిల్లును వ్యతిరేకించిన ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటకు తీసుకెళ్లారు.

ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం తెలిపిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును నేడు రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలకు గాను ప్రస్తుతం 229 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ 95, కాంగ్రెస్ 29, టీఎంసీ 13, డీఎంకే10, బీజేడీ, ఆప్ 8 చొప్పున, టీఆర్ఎస్, వైసీపీ 6 చొప్పున, అన్నాడీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎం 5 చొప్పున, జేడీయూ, ఎన్‌సీపీ నాలుగు చొప్పున, బీఎస్పీ, శివసేన 3 చొప్పున, సీపీఐ, స్వతంత్రులు 2 చొప్పున, ఇతర చిన్న పార్టీల నుంచి 15 మంది, ఒకరు నామినేటెడ్ ఉన్నారు. లోక్ సభలో భారీ మెజారిటీతో ఆమోదం పొందడంతో రాజ్యసభలో ఈ బిల్లుకు ఎటువంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. లోక్‌సభలో కేవలం ఇద్దరు ఎంఐఎం కు చెందిన ఇద్దరు సభ్యులు వ్యతిరేకించారు. రాజ్యసభలో ఆ సమస్య లేదు. అందులోను విపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories