Parliament Session: మణిపూర్ అంశంతో దద్దరిల్లిన పార్లమెంట్.. బీఆర్ఎస్‌ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్..

The Speaker Rejected The Motion Of No Confidence Given By BRS
x

Parliament Session: మణిపూర్ అంశంతో దద్దరిల్లిన పార్లమెంట్.. బీఆర్ఎస్‌ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.. 

Highlights

Parliament Session: విపక్షాలు పట్టు వీడకపోవడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం

Parliament Session: పార్లమెంట్‌ మరోసారి మణిపూర్ అంశంతో దద్దరిల్లింది. ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఐదోరోజూ పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విపక్షాలు ప్రధాని స్పందించాలంటూ నినాదాలతో పార్లమెంట్‌ను హోరెత్తించారు. దీంతో నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు సాగాయి. లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేయగా.. వాయిదాల పర్వం కొనసాగింది. వాయిదాల తర్వాత కూడా విపక్షాలు పట్టు వీడకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్.అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో రేపటికి వాయిదా వేశారు ఛైర్మన్

మణిపూర్ అంశంపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది విపక్ష ఇండియా కూటమి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీర్మానాన్ని లోక్‌ సభలో సమర్పించారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. అయితే అవిశ్వాసంపై చర్చ గురించి అన్ని పార్టీల నేతలతో చర్చించి సమయం చెబుతామన్నారు స్పీకర్. సభకు పదమూడు రోజుల సమయం మాత్రమే ఉండగా.. 10 రోజుల్లోగా అవి‌శ్వాస తీర్మానంపై చర్చ జరపాల్సి ఉంది. దీంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్‌కు సమయంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా లోక్‌సభలో అవి‌శ్వాస తీర్మానం ప్రశేశపెట్టింది. అయితే ఆరుగురు ఎంపీల సంతకాలు మాత్రమే ఉండటంతో స్పీకర్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories