దక్షిణ మధ్య రైల్వే సంస్థ కీలక నిర్ణయం

The South Central Railway key decision
x

Representational Image

Highlights

దేశంలో అతి పెద్ద రవాణా సంస్థగా పేరు పొందిన రైల్వే సంస్థ సైతం పలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నివారణ చర్యల దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో...

దేశంలో అతి పెద్ద రవాణా సంస్థగా పేరు పొందిన రైల్వే సంస్థ సైతం పలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నివారణ చర్యల దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే దక్షిణ మధ్య రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ రైల్వే జోన్ పరిధిలోని 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ నుండి రైల్వే లో తీవ్ర ఆర్థిక నష్టాలు వస్తుండడం, ప్రయాణికుల నుండి పెద్దగా స్పందన కనబడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.

కోవిడ్ తో ప్రతి ఒక్క రంగం ఆర్థికంగా కుదేలయింది. ఇప్పటికి కూడా ఇంకా మాములు స్థితికి చేరుకోలేకపోతున్నాయి కొన్ని సంస్థలు. దీంతో ఖర్చు తగ్గించుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో రైల్వే ఏ మాత్రం తక్కువ కాదు. ఇప్పటికీ కూడా జనరల్ రైళ్లను ప్రారంభించలేదు. తాజాగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రయణికులకు పెద్దగా ఉపయోగపడని 31 రైల్వే స్టేషన్ లను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.

రైల్వే సంస్థ మూసివేస్తోన్న ఈ రైల్వే స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ అంతంత మాత్రమే ఉంటున్న కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అములులోకి వస్తుందని.. మొదటగా 29 స్టేషన్లు మూతపడతాయని ఆ తర్వాత ఏప్రిల్1 నుంచి మిగిలిన 2 రైల్వే స్టేషన్లు కూడా మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ 30 స్టేషన్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరిధిలోనివే కావడం గమనార్హం. కేవలం ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్‌ జిల్లాలో ఉంది.

ఇక డివిజన్ల వారీగా సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో 16 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్ పరిధిలో 7, గుంతకల్ పరిధిలో 3, గుంటూరు రైల్వే పరిధిలో 4, ఇక మిగిలినది నాందేడ్ పరిధిలోకి రానుంది.ఈ స్టేషన్ లలో ప్రయాణికుల నుండి పెద్దగా స్పందన లేకుండా సరైన నిర్వహణ లేకుండా ఉన్న స్టేషన్లని రైల్వే అధికారులు తెలిపారు. 31 స్టేషన్లను మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కరోనా కారణంగా ఇప్పటికే చాలా నష్టపోయిన రవాణ సంస్థ, నివారణ చర్యల్లో భాగంగానే వ్యవహరిస్తుందని అధికారులు చెప్తున్నారు. వీటిని కేవలం తాత్కాలికంగా మాత్రమే మూతవేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికల రద్దీ పెరిగిన తర్వాత.. వీటిని పునరుద్ధరించే అవాకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికి ఇంకా కోవిడ్ తో ఆగిపోయిన రైళ్లు పునప్రారంభం కాలేదు. ఎంఎంటిఎస్ రైళ్ల కోసం సామాన్యులు ఎదురు చూస్తున్నారు వాటిని పునరుద్ధరణ చేయాల్సింది పోయి సంస్థ నష్టాలు అంటూ ఉన్న స్టేషన్లు కూడా మూసివేస్తుండడం పై రైల్వే అధికారులు పునరాలోచించాల్సిన అవసరం ఉంది

Show Full Article
Print Article
Next Story
More Stories