Puri Jagannath Temple: నేడు మరోసారి తెరచుకోనున్న పూరీ రత్న భాండాగారం..నిధిపై రెండో విడత సర్వే

The second phase of the survey on the treasure of Puri Ratna Bhandagaram will be opened again today
x

 Puri Jagannath Temple: నేడు మరోసారి తెరచుకోనున్న పూరీ రత్న భాండాగారం..నిధిపై రెండో విడత సర్వే

Highlights

Puri Jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నా భాండాగారం మరోసారి నేడు తెరచుకోనుంది. అందులో ఉన్న నిధి నిక్షేపాలను వెలికి తీసేందుకు..అందులో ఉన్న సంపదను అన్వేషించేందుకు ఈ రత్న భాండాగారాన్ని అధికారులు మరోసారి తెరుస్తారు. ఈ క్రమంలోనే 3 రోజులపాటు పూరీ రత్నభాండాగారంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎన్ఐ అధికారులు రెండో విడత సర్వే నిర్వహించనున్నారు. సర్వే సమయంలో భక్తుల దర్శనాలపై ఆంక్షలు విధించనున్నారు అధికారులు.

ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలో రత్నా భాండాగారాన్ని మరోసారి తెరుచుకోనుంది. ఇప్పటికే కొన్ని నెలల క్రితం పూరీ ఆలయంలో తొలివిడత సర్వే నిర్వహించారు. తాజాగా రెండో విడత సర్వేను భారత పురావస్తు శాఖ ఏఎన్ఐ అధికారులు శనివారం ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సర్వేలో భాగంగా మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 6గంటల వరకు దేవతల దర్శనం కోసం వచ్చే భక్తులను నిలిపివేయనున్నారు. ఒడిశా రత్న భాండాగారంలోని నిధి నిక్షేపాలను వెలికితీయడం సంపద అన్వేషణకు ఉద్దేశించిన ఈ సర్వే సోమవారం వరకు కొనసాగుతుంది.

ఈ సర్వే కారణంగా మూడు రోజుల పాటు ఒడిశా పూరీ ఆలయంలో పలు ఆంక్షలు విధిస్తారు అధికారులు. ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తోబుట్టువుల దేవతల దర్శనాన్ని భక్తులకు నిషేధించారు. సర్వేకు భక్తులు సహకరించాలని పూర్తీ ఆలయ అధికారులు విజ్నప్తి చేశారు. ఈ మూడు రోజుల పాటు నిర్వహించనున్న సర్వే సమయంలో పూరీ ఆలయం ప్రధాన ద్వారాలను మూసివేయనున్నారు. ఆలయ రత్న భాండాగారంలో ఏదైనా రహస్య గది లేదా సొరంగం ఉన్నాయా లేదా అనే విషయాలను ఈ సర్వే ద్వారా తేల్చనున్నట్లు రత్న భండాగర్ ఇన్వెంటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు.

ఈ సర్వే కోసం అత్యాధుని రాడార్ ను ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే రత్న భండార్ లోని మొదటి దఫా సర్వేను పూర్తి చేశారు. సెప్టెంబర్ 18వ తేదీన తొలి సర్వే నిర్వహించారు. అందులో 17 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా పూరీ రత్నా భాండాగారంలో ప్రాథమిక ఇన్ స్పెక్షన్ చేపట్టారు. ఈ టీమ్ లో హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్, ఎన్జీఆర్ఐలకు చెందిన నిపుణులు ఉన్నారు.

ఇక పూరీ శ్రీక్షేత్రం రత్న భాండాగారం తలుపులను 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత...ఈ ఏడాది జులై 14వ తేదీన మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. పూరీ జగన్నాథుని అంతులేని సంపద ఉన్న మూడో రహస్య గది తలుపులు అక్కడున్న 3 తాళం చెవులతోనూ తెరచుకోలేదు. దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి అధికారులు లోపలికి వెళ్లారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన శ్రీ క్షేత్ర పాలనాధికారి అరవింద పాఢి, పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వయిన్, మరో ఎనిమిది మంది ఇతర అధికారుల రత్న భాండాగారం లోపలికి వెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories