Assam: అస్సాంలో కొనసాగుతున్న వరదల బీభత్సం

The ongoing flood crisis in Assam
x

Assam: అస్సాంలో కొనసాగుతున్న వరదల బీభత్సం

Highlights

Assam: వరదలతో జన జీవనాన్ని అస్తవ్యస్తం

Assam: అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఈ వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహించాయి. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రధాన నదులు, వాటి ఉపనదుల్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల 70 వేల మంది వరదలకు తీవ్ర ప్రభావితులయ్యారు. వరదల కారణంగా ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

అస్సాం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ లెక్కల ప్రకారం.. ఒక్కరోజులోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాచర్‌లో ఇద్దరు మరణించగా.. ధుబ్రి, ధేమాజీ, సౌత్‌ సల్మారా, నాగావ్‌, శివసాగర్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది వరదలు, కొండ చరియలు విరిగిపడటం, తుపానుల కారణంగా రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 92కు పెరిగింది. అందులో ఒక్క వరదల కారణంగానే 79 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రఖ్యాత కజిరంగా నేషనల్‌ పార్క్‌ను ఇటీవలే కాలంలో ఎన్నడూ లేనివిధంగా వరదలు ముంచెత్తాయి. దీంతో మొత్తం 159 వన్యప్రాణులు మరణించాయి. 20 జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. సుమారు 133 జంతువులను అధికారులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వదరలకు రాష్ట్రంలో 13లక్షలా 66వేల 829 జంతువులు ప్రభావితమయ్యాయి. వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 94 రోడ్లు పూర్తిగా దెబ్బతినగా.. మూడు వంతెనలు కొట్టుకుపోయాయి. 26 ఇళ్లు, ఆరు కట్టలు కూడా దెబ్బతిన్నాయి. ఇక నిమతిఘాట్, తేజ్‌పూర్, గౌహతి, ధుబ్రి వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories