ఈ నెలలో చంద్రగ్రహణం.. ఎప్పుడంటే..!

ఈ నెలలో చంద్రగ్రహణం.. ఎప్పుడంటే..!
x
Highlights

ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఈ నెలలో ఏర్పడబోతోంది. ఈ గ్రహణం విశేషాలు.. భారత్ లో ఎప్పుడు ఎంతసేపు కనిపిస్తుంది వివరాలు.

జూన్ 5 న ఈ సంవత్సరంలో రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం తో పాటు అన్తార్కితికాలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది.

సూర్యునికి, చంద్రునికి మధ్యలో భూమి వచ్చినపుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందనే సంగతి తెలిసిందే. అయితే, ఈ చంద్రగ్రహణం మూడు విధాలుగా ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, పెనంబ్రల్ చంద్రగ్రహణం. ఇప్పుడు జూన్ 5 న ఏర్పడబోయే చంద్రగ్రహణం పెనంబ్రల్ చంద్రగ్రహణం. ఈ గ్రహణం సమయంలో భూమి యొక్క ముఖ్యమైన నీడ చంద్రునిమీద పడదు.

భారత్ లో ఎప్పుడు..?

timeanddate.com వెబ్సైట్ లో పేర్కొన్న ప్రకారం జూన్ 5 న ఏర్పడే పెనంబ్రల్ చంద్రగ్రహణం రాత్రి 11:15 గంటలకు మొదలవుతుంది. జూన్ ఆరు తెల్లవారుజామున 2:34 ముగుస్తుంది.

మొత్తం గ్రహణ సమయం మూడు గంటల 19 నిమిషాలు.. అయితే, 12.54 నిమిషాలకు పూర్తిగా చంద్రుడు కనిపించని స్థితి వస్తుంది.

ఈ గ్రహణ సమయంలో భారతీయులు పలు విశ్వాసాలు కలిగి ఉంటారు. చంద్ర గ్రహణ సమయంలో భారతీయులు పలు రకాల పూజలు, సంప్రోక్షణలు.. విధి విధానాలు పాటిస్తారు.

ఈ చంద్ర గ్రహణం మామూలు కంటితో కూడా చూడవచ్చు. అయితే, శాస్త్రజ్ఞులు మాత్రం టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహణాన్ని చూడమని సూచిస్తారు.

ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం జనవరి 10 న ఏర్పడింది. ఇప్పుడు ఏర్పడుతున్నది రెండో చంద్ర గ్రహణం. ఇంకో గ్రహణం జూలై, లోనూ మరోటి నవంబర్ లోనూ ఏర్పడే అవకాశాలున్నాయి.

ఇన్ని గ్రహనాల్లోనూ జూన్ 5 న రాబోతున్న గ్రహణం, నవంబర్ 29 ఏర్పడబోయే గ్రహణం మాత్రమె కొంతవరకూ కంటితో చూసే అవకాశం ఉంది.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీషులో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories