కలవర పెడుతున్న డబ్ల్యూహెచ్‌వో తాజా హెచ్చరిక

The latest warning from the disturbing WHO
x

కలవర పెడుతున్న డబ్ల్యూహెచ్‌వో తాజా హెచ్చరిక 

Highlights

WHO: దశాబ్దాల పాటు కరోనా మహమ్మారి ప్రభావం, టీకాల పంపిణీలో దేశాల మధ్య వ్యత్యాసం.

WHO: కరోనా ఇంకా ప్రపంచాన్ని భయ పెడుతూనే ఉంది. కొద్దిరోజులుగా వైరస్ వ్యాప్తి తగ్గినా కొత్త వేరియంట్ల ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక మరింత కలవర పెడుతోంది. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానమ్ వెల్లడించారు. ముఖ్యంగా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉండే గ్రూపుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువ ఉంటుందన్నారు.

టీకాల పంపిణీలో దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. కామన్ వెల్త్ దేశాల్లో కేవలం 42శాతం మంది మాత్రమే రెండు డోసుల టీకా పొందారన్నారు. ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23శాతం ఉందన్నారు. అందరికి వ్యాక్సిన్ అందించడమే డబ్ల్యూహెచ్‌వో తక్షణ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories