మధ్యప్రదేశ్‌లో విషాదంగా ముగిసిన బాలుడి ఘటన

The Incident Of The Boy That Ended In Tragedy In Madhya Pradesh
x

మధ్యప్రదేశ్‌లో విషాదంగా ముగిసిన బాలుడి ఘటన 

Highlights

* ఈనెల 6న ఆడుకుంటూ బోరుబావిలో పడిన బాలుడు.. 50 అడుగుల లోతులో చిక్కుకుపోవడంతో బాలుడు మృతి

Madhya Pradesh: 4రోజుల శ్రమ ఫలించలేదు. ఆ తల్లిదండ్రుల ఆశలు అడి ఆశలే అయ్యాయి. విధి వెక్కించరించడంతో కన్నవారికి కడుపుకోతే మిగిలింది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా మాండవి గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన 8ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈనెల 6న బాలుడు తన్మయ్ సాహు పొలంలో ఆడుకుంటూ 400 అడుగుల లోతున్న బోరుబావిలో జారిపడ్డాడు. 50 అడుగల లోతులో చిక్కుకున్న ఆ బాలుడిని రక్షించేందుకు 4 రోజుల పాటు అధికారులు చేసిన కృషి ఫలించలేదు.

50 అడుగుల లోతులో బోరు బావిలో చిక్కుకుపోవడంతో అందులోకి నిరంతరాయంగా ఆక్సీజన్ అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. బోరు బావికి సమాంతరంగా సొరంగం తొవ్వి బాలుడిని బయటకు తీశారు. అయితే అప్పటికే బాలుడు చనిపోయాడని అధికారులు ప్రకటించారు. 4 రోజుల పాటు నిరంతరాయంగా ప్రయత్నించినప్పటికీ బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయామని తెలిపారు. బాలుడి మృతిపట్ల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories