Dangerous Railway Stations: ఇండియాలో ఈ 4 భ‌యంక‌ర రైల్వే స్టేష‌న్‌ల‌ట‌..!

The Four Most Dangerous Railway Stations in India
x

ఇండియాలో ఈ 4 భ‌యంక‌ర రైల్వే స్టేష‌న్‌లు (ఫైల్ ఫోటో)

Highlights

* దేశంలో అతిపెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ ఇండియ‌న్ రైల్వే

Dangerous Railway Stations: దేశంలో అతిపెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ ఇండియ‌న్ రైల్వే. ప్ర‌తి రోజు కొన్నిల‌క్ష‌ల మందిని గ‌మ్య‌స్థానాల‌కు చేర్చుతుంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైలు నెట్‌వర్క్ బ్రిటీష్ కాలం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వాణా రంగంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఎంతో మంది రైల్వేలో ప‌నిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్ప‌టికి దేశంలో కొత్త రైల్వే స్టేష‌న్ల నిర్మాణం జ‌రుగుతూనే ఉంది. అయితే ఇండియాలో ఉన్న రైల్వే స్టేష‌న్ల‌లో కొన్ని భ‌యంక‌ర రైల్వే స్టేష‌న్లు కూడా ఉన్నాయి.

1.చిత్తూరు రైల్వే స్టేషన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరులో ఉన్న రైల్వేస్టేష‌న్ భ‌యంకర రైల్వేస్టేష‌న్ లిస్టులో చేరింది. ఎందుకంటే చాలా కాలం కింద‌ట సిఆర్‌పిఎఫ్ జవాన్ హరి సింగ్ ఈ స్టేషన్‌లో దిగినట్లు ప్రజలు చెప్పారు. రైలు దిగిన తరువాత అతడిని ఆర్‌పిఎఫ్, టిటిఈ ఉద్యోగులు క‌లిసి కొట్టారు. ఈ సంఘ‌ట‌న‌లో అతను మరణించాడు. అప్పటి నుంచి సిఆర్పిఎఫ్ జవాన్ హరి సింగ్ ఆత్మ న్యాయం కోసం ఈ రైల్వే స్టేషన్ తిరుగుతుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

2. నైని రైల్వే స్టేషన్

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాజ్‌లో ఉన్న నైని జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ప్ర‌మాద‌క‌ర రైల్వేస్టేష‌న్ లిస్టులో చేరింది. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ సమీపంలో నైనీ జైలు ఉంది. ఇక్క‌డ దేశ స్వాతంత్ర్యానికి విశేషంగా కృషి చేసిన చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులు చంప‌బ‌డ్డారు. వారి ఆత్మ‌లు ఈ రైల్వే స్టేషన్‌లో తిరుగుతాయని అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు.

3. బేగున్‌కోదర్ రైల్వే స్టేషన్

పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఉన్న బేగున్‌కోదర్ రైల్వే స్టేషన్ ఒక డేంజర్ కథను కలిగి ఉంది. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు తెల్లని చీర ధరించిన ఆడ దెయ్యాన్ని చూశారని చెప్పారు. స్టేషన్‌కు సంబంధించిన ఈ దెయ్యాల వాదనల కారణంగా ఈ స్టేష‌న్‌ని 42 సంవత్సరాలు మూసివేశారు. 2009 సంవత్సరంలో మరోసారి సేవలు ప్రారంభించారు.

4. బరోగ్ రైల్వే స్టేషన్

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో ఉన్న బరోగ్ రైల్వే స్టేషన్ కూడా అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఈ రైల్వే స్టేషన్ పక్కన ఒక సొరంగం ఉంటుంది. దీనిని బరోగ్ టన్నెల్ అంటారు. వాస్తవానికి ఈ సొరంగం కల్నల్ బరోగ్ అనే బ్రిటిష్ ఇంజనీర్ నిర్మించారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. కల్నల్ బరోగ్ ఆత్మ బరోగ్ సొరంగంలో తిరుగుతున్నట్లు అక్క‌డి ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories