విద్యార్థి రాకెట్ దగ్గరకెళ్లి పరిశీలించే క్రమంలో సంభవించిన పేలుడు

The Explosion Occurred While The Student Was Inspecting The Rocket
x

విద్యార్థి రాకెట్ దగ్గరకెళ్లి పరిశీలించే క్రమంలో సంభవించిన పేలుడు

Highlights

* 12 మంది విద్యార్థులు గాయపడ్డారు.. ఆరుగురికి తీవ్రగాయాలుకాగా, మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.

Jharkhand: విద్యార్థులకు చదువుతోపాటు సైన్సు ప్రయోగాలతో విషయ పరిజ్ఞానం పెంపొందించాలనే ఉద్ధేశంతో తలపెట్టిన సైన్స్ ఎగ్జిబిషన్ బెడిసికొట్టింది. జార్ఖండ్‌లోని ఘట్‌శిల కళాశాలలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో విద్యార‌్థులు వివిధ నమూనాలను ప్రదర్శించారు. ఇందులో రాకెట్ ప్రయోగ నమూనా విద్యార్థులందరినీ ఆకట్టుకుంది. ఘట్‌శిల కళాశాల వేదికగా రాకెట్‌ను నింగిలోకి పంపేప్రక్రియలో సాంకేతికలోపం చోటుచేసుకుంది.

మండుకున్న రాకెట్ ఎంతకీ ఎగరకపోవడంతో ప్రాజెక్టును చేపట్టిన విద్యార్థి రాకెట్ దగ్గరకెళ్లి పరిశీలించే క్రమంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఆరుగురికి తీవ్రగాయాలుకాగా, మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిని విద్యార్థుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అధ్యాపకుల పర్యవేక్షణలో ప్రయోగాలు చేస్తేప్రయోజనకరంగా ఉంటుందని, ప్రమాదకరప్రయోగాల జోలికి విద్యార్థులు వెళ్లకుండా ఉంటేనే మంచిదని డాక్టర్లు అభిప్రాయం వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories