vaccine: త్వరలోనే దేశంలో అతి తక్కువ ధరకే కొవిడ్ వ్యాక్సిన్

The Covid Vaccine Will Soon be the Cheapest in the Country
x

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

vaccine: బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.

Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ ని మొదట ఎవరూ పట్టించుకోలేదు. కాని సెకండ్ వేవ్ రాగానే అందరూ పరుగులు పెట్టారు. కాని అప్పటికి ప్రొడక్షన్ అవసరానికి తగినంత కాకపోవడంతో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. సెకండ్ వేవ్ భయాన్ని వాడుకుని వ్యాక్సిన్ కంపెనీలు ఇష్టమొచ్చిన రేట్లు ఫిక్స్ చేశాయి. ఉచితంగా ఇస్తామని కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. ఆ ఖర్చను ప్రభుత్వాలే భరించాల్సి వస్తోంది. ఇది కూడా కొన్ని రాష్ట్రాలకు సమస్యగా మారింది. అయితే ఇప్పుడు కోర్బెవాక్స్ అనే వ్యాక్సిన్ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్ కు చెందిన బీఈ (బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ) దీనిని రూపొందించింది. అన్ని అనుమతులు వచ్చి మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్ వస్తే.. ఇతర కంపెనీలు కూడా రేట్లు తగ్గించుకోవాల్సిన పరిస్ధితి వస్తుంది.

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఇది అన్ని అనుమతులు పొంది మార్కెట్లోకి వస్తే ఇప్పుడున్న అన్ని కరోనా వ్యాక్సిన్లలోకి ఇదే అత్యంత చవకైన వ్యాక్సిన్ కానుందని అధికారులు వెల్లడిస్తున్నారు. కోర్బెవాక్స్ సింగిల్ డోస్ ధరను బయోలాజికల్ ఈ సంస్థ రూ.250గా నిర్ణయించింది. అదే రెండు డోసులు అయితే రూ.400 కే పొందవచ్చు. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల పలు విషయాలను వెల్లడించారు. కోర్బెవాక్స్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలను చూపించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కోర్బెవ్యాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వేగవంతంగా జరుగుతున్నాయి.

కాగా.. ఇతర సంస్థల వ్యాక్సిన్లతో పోల్చితే ఈ వ్యాక్సిన్ తక్కువ ధరకు లభించనుంది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే రేటు రూ.300 కాగా, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 లకు అందిస్తోంది. భారత్ బయోటెక్ తయారుచేసేన కోవ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కి అందిస్తుండగా, దీని ధర ప్రైవేటు ఆసుపత్రుల వద్ద రూ.1,200గా ఉంది. ఇక, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఒక్క డోసు వెల రూ.995 గా ఉంది. వీటన్నింటితో పోల్చితే బయోలాజికల్ ఇ సంస్థ రూపొందించిన కోర్బెవాక్స్ చవకైనదిగా మారనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories