Hindenburg-Adani: కార్పొరేట్ వర్గాల్లో టెన్షన్.. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై అదానీ రియాక్షన్..!

Hindenburg-Adani
x

Hindenburg-Adani

Highlights

Hindenburg-Adani: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన తాజా ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. అవన్నీ కుట్రపూరితంగా చేస్తున్నవని కొట్టిపారేసింది.

Hindenburg-Adani: అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన తాజా ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. అవన్నీ కుట్రపూరితంగా చేస్తున్నవని కొట్టిపారేసింది. వ్యక్తిగత లాభం కోసం సమాచారాన్ని వక్రీకరిస్తూ మదుపరులను తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తోందని తెలిపింది. హిండెన్‌బర్గ్‌ తాజాగా ఆరోపించిన అంశంపై అదానీ గ్రూప్ కంపెనీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు జరిగినట్లు అదానీ గ్రూప్‌ పేర్కొంది. అవన్నీ నిరాధారమైనవని తేలిందని తెలిపింది.

సుప్రీంకోర్టు సైతం క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు వెల్లడించింది. అయినప్పటికీ హిండెన్‌బర్గ్‌ పాత వాదనలను పదే పదే వల్లె వేస్తోందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో అదానీ గ్రూప్‌ ప్రతినిధి తెలిపారు. తమ విదేశీ కంపెనీల కార్యకలాపాలు పారదర్శకంగా సాగుతున్నాయని వివరించారు. వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతామని చెప్పారు. తమ కంపెనీలకు ఏ వ్యక్తితోనూ వాణిజ్య సంబంధాలు లేవంటూ పరోక్షంగా మాధబి పురిని ఉద్దేశించి తెలిపారు. తమ వ్యాపారాలన్నీ చట్టాలకు లోబడే సాగుతున్నాయన్నారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ పారదర్శకంగా ముందుకెళ్తున్నామని అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories