Manipur: భయం గుప్పిట మణిపూర్‌

Tensions Run High After Fresh Bout Of Clashes In Indias Manipur
x

Manipur: భయం గుప్పిట మణిపూర్‌

Highlights

Manipur: శాంతిభద్రతల కోసం 10వేల మంది సైనికుల విధులు

Manipur: తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఘర్షణల్లో 70 మంది మృతి చెందారు.కాగా మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్రమంతటా ఇంటర్నెట్‌ సేవలు నిలిపేశారు. కొద్ది గంటల సడలింపుతో కర్యూ కొనసాగిస్తున్నారు. శాంతి భద్రతల కోసం 10 వేల మంది సైనికులను రాష్ట్రమంతటా మోహరించినట్టు సర్కారు తెలిపింది. సోమవారం జరిగిన హింసకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు సీఎం బిరేన్‌ సింగ్‌ వెల్లడించారు.

లైనెన్స్‌ కలిగిన తుపాకులతో కొందరు స్థానికులు వారి ప్రాంతాల్లో కాపలా కాశారు. మరోవైపు మణిపూర్‌ పరిస్థితిపై రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ స్పందించారు. మత రాజకీయాలు ప్రజలను రాజకీయంగా ప్రభావితం చేస్తాయని ట్వీట్‌ చేశారు. మత రాజకీయాలనే వైరస్‌ వ్యాప్తి చెందితే జరిగే పరిణామాలను ఊహించలేమన్నారు. దాని వల్ల కలిగే ఫలితాలు తాత్కాలికమని, కానీ అవి శాశ్వతంగా భయపెడతాయని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories