Karnataka: కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలో ఉద్రిక్తత

Tension in Shivmogga In Karnataka State
x

Karnataka: కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలో ఉద్రిక్తత

Highlights

Karnataka: అమీర్ అహ్మద్ సర్కిల్‌లో ఫ్లెక్సీల ఏర్పాటుపై రగడ

Karnataka: కర్ణాటకలోని శివమొగ్గలో ప్లెక్సీ ఏర్పాటులో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శివమొగ్గ అమీర్‌‌ అహ్మద్‌ సర్కిల్‌లో హిందుత్వ ఐకాన్ వీడీసావర్కర్, 18వ శతాబ్ధపు మైసూర్ రాజు టిప్పుసుల్తాన్ ప్లెక్సీలను ఏర్పాటుచేసే విషయంలో ఇరువర్గా మధ్య వాగ్వాదంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

స్వాతంత్ర్య వేడుకల సందర‌్భంగా సావర్కర్ ప్లెక్సీ కట్టేందుకు ప్రయత్నించడా మరోవర్గం అడ్డుకుంది. అక్కడ టిప్పుసుల్తాన్ ప్లెక్సీ కట్టాలని డిమాండ్ చేశారు. ఇరువర్గాల వాగ్వాదంతో ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.

ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడా ప్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రేమ్ సింగ్ అనే యువకుడు దుకాణంమూసి తాళం వేసుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గాయపరచారు. రక్తస్రావంతో ఆస్పత్రికి తరలించి యువకుడికి చికిత్స అందిస్తున్నారు. కత్తిదాడికి గురైన యువకుడు ప్లెక్సీ వివాదానికి సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. శివమొగ్గలో చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన నలుగురిని పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories