వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం.. సెప్టెంబర్ 25 నుంచే..

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం.. సెప్టెంబర్ 25 నుంచే..
x
Highlights

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్ష పార్టీ రైతుల తరఫున పోరాటాలకు దిగుతోంది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం..

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీహార్ లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ రైతుల తరఫున పోరాటాలకు దిగుతోంది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లును ఆర్జేడీ ప్రధాన ఎన్నికల అజెండాగా మలుచుకుంది. ఆర్జేడీ అగ్రనేత తేజశ్వి యాదవ్ నేతృత్వంలో సెప్టెంబర్ 25 నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్డుపైకి రానున్నారు. రైతుల తరఫున ధర్నాలు, దీక్షలు చేయనున్నారు. ఈ విషయాన్నీ ఆర్జేడీ పార్టీ విలేకరుల సమావేశంలో ప్రకటించింది.

కేంద్రం తెచ్చిన కొత్త బిల్లులతో రైతులు మోసపోతున్నారని తేజశ్వి యాదవ్ బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ దీనిని సహించదని.. పోరాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్జేడీ ఎప్పుడూ రైతులతోనే ఉంటుందని, వారికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా.. పోరాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కడుపు నింపే రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రధాని నూతన వ్యవసాయ బిల్లులు తెచ్చారని తేజశ్వి యాదవ్ అన్నారు.బీహార్ లోని రైతులందరూ ఆర్జేడీతోనే ఉన్నారని అన్నారు. జై జవాన్ మరియు జై కిసాన్ నినాదంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళతామన్నారు.

కాగా బుధవారం ఆర్జెడి కార్యాలయం నుండి ప్రచారం రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు తేజస్వి. డబుల్ ఇంజిన్ తో ఉండే ప్రచార రధం.. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను బహిర్గతం చేయడానికి అన్ని ప్రాంతాల్లో తిరుగుతుందని చెప్పారు. బీహార్ లో జేడీయూ అప్పుడే ఓటమిని అంగీకరిస్తుందని.. అందుకే తమ పార్టీ నేతల్ని తీసుకుంటున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories