GST Council Meeting : క్యాన్సర్ మందులపై ట్యాక్స్ తగ్గింపు..ఆరోగ్య బీమాపై ప్రీమియం భారీగా తగ్గే ఛాన్స్

Tax reduction on cancer drugs Chance of huge reduction in premium on health insurance
x

 GST Council Meeting : క్యాన్సర్ మందులపై ట్యాక్స్ తగ్గింపు..ఆరోగ్య బీమాపై ప్రీమియం భారీగా తగ్గే ఛాన్స్

Highlights

GST Council Meeting : లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు విషయంలో జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం వాయిదా పడింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు జీఓఎంను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. క్యాన్సర్ మందులపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

GST Council Meeting : లైఫ్ ఇన్సూరెన్స్ బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా పడింది. నవంబర్ లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో భేటీ అయిన 54వ జీఎస్టీ మండలి, ఈ అంశంపై మంత్రుల బ్రందాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే సమావేశంలో క్యాన్సర్ మందులపై నమ్కీన్స్ జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం వెలువడింది. కౌన్సిల్ సమావేశం అనంతరం సమావేశం వివరాలను మీడియాలో సమావేశంలో మంత్రి వెల్లడించారు.

జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈజీఎన్టీ కౌన్సిల్ సమావేశంలోనే ఈ నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మండలి, మంత్రుల బ్రుందానికి ఆ బాధ్యతను అప్పగించింది. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి నేత్రుత్వంలో జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బ్రుందానికే ఈ బాధ్యతనూ కట్టబెట్టంది. కొంతమంది కొత్త సభ్యులు ఈ బ్రుందంలో చేరుతారని..అక్టోబర్ చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనిపై నవంబర్ లో జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఒక మూలం ప్రకారం, GST కౌన్సిల్ ఆరోగ్య బీమా ప్రీమియంపై GST రేటును 18 శాతం నుండి సున్నాకి తగ్గించవచ్చు. అయితే, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ రేటు కొనసాగే అవకాశం ఉంది. 2,000 కంటే ఎక్కువ ఆన్‌లైన్ చెల్లింపులపై పన్ను విధించే ప్రతిపాదనపై జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

GST కౌన్సిల్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. దానిలో రాష్ట్ర మంత్రులు సభ్యులుగా ఉన్నారు. గత నెలలో, రేట్లను హేతుబద్ధీకరించడానికి జిఎస్‌టిపై పునర్నిర్మించిన మంత్రుల బృందం మొదటి సమావేశం తరువాత, బీహార్ ఉప ముఖ్యమంత్రి, రేట్ రేషనలైజేషన్‌పై జిఎస్‌టి మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి ఆరోగ్య బీమాలో రేట్లలో మార్పులకు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు.పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ, "జీవిత ,ఆరోగ్య బీమాపై జిఎస్‌టిని తగ్గించాలని నేను అభ్యర్థించాను. ఫిట్‌మెంట్ కమిటీ దానిని పరిశీలిస్తోందని నాకు చెప్పబడింది." జూన్ 22న జరిగిన చివరి GST కౌన్సిల్ సమావేశంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధార్ బయోమెట్రిక్ ఇంటిగ్రేషన్, రైల్వే సేవల్లో సడలింపుతో సహా అనేక ముఖ్యమైన చర్యలను ప్రకటించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories