Jayalalitha's House As CM's Residence In Tamilnadu: వేది నిలయం సీఎం అధికార నివాసం, తమిళనాడు ప్రభుత్వం పరిశీలన

Jayalalithas House As CMs Residence In Tamilnadu: వేది నిలయం సీఎం అధికార నివాసం, తమిళనాడు ప్రభుత్వం పరిశీలన
x
Jayalalitha's house to be converted As CM'S Residence
Highlights

Jayalalitha's House As CM's Residence In Tamilnadu: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాస గృహం వేద నిలయాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి అదికారిక నివాసంగా మార్చాలని భావిస్తోంది

Jayalalitha's House As CM's Residence In Tamilnadu: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాస గృహం వేద నిలయాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి అదికారిక నివాసంగా మార్చాలని భావిస్తోంది.చెన్నై పోయస్ గార్డెన్స్ లో ఈ గృహం ఉంది. దీనిని ముఖ్యమంత్రి అదికారిక నివాసంగా మార్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని, తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు తెలియచేసిందన్న వార్త వచ్చింది. వేదనిలయంలో ఎక్కువ భాగం స్మారకంగా కాకుండా రాష్ట్ర సీఎం అధికారిక నివాసంగా మార్చాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ చేసిన సూచనను పరిశీలిస్తున్నట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. పోయస్‌ గార్డెన్‌ను తాత్కలికంగా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించి గతంలో

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, 'అమ్మ' జయలలిత నివాసం 'వేద నిలయం'ను సేకరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసింది. పొయెస్ గార్డెన్‌లోని ఆమె నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చేందుకు నిర్ణయించింది.

రెవిన్యూ డివిజనల్ అధికారి సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ భూమి, భవనాలు ప్రజా ప్రయోజనాల కోసం అవసరమని సంతృప్తి చెందినట్లు ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి, 'అమ్మ' జయలలిత నివాసం 'వేద నిలయం'ను ప్రభుత్వ స్మారక కేంద్రంగా మార్చేందుకు అవసరమని తెలిపింది. ఈ కార్యక్రమం వల్ల కుటుంబాలు నిర్వాసితులు కావడం, వారికి పునరావాసం కల్పించడం వంటివేవీ ఉండవని తెలిపింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి 2018 ఆగస్టులో దీనికి సంబంధించిన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories