Tamilnadu: స్టాలిన్ మంత్రి వర్గంలో ఐదుగురు తెలుగువారు

Muthuvel Karunanidhi Stalin Tamil nadu Cm
x

Muthuvel Karunanidhi Stalin File Photo

Highlights

Tamilnadu:తమిళనాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Tamilnadu: తమిళనాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. స్టాలిన్ నేతృత్వంలోని ఆపార్టీ 133 స్థానాల్లో విజ‌యం సాధించి అధికార‌న్ని హ‌స్త‌గ‌తం చేసుకుంది. అన్నాడిఎంకే 66 స్థానాల్లో విజ‌యం సాధించి ప్ర‌తిప‌క్ష పాత్ర‌కే ప‌రిమితం అయింది. ఘన విజయం సాధించిన డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్... 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.స్టాలిన్ మంత్రి వ‌ర్గంలో ఐదుగురు తెలుగువారు ఉండటం గమనార్హం. కీలక శాఖలను అప్పగించడం గమనార్హం.

గతంలో బాలకృష్ణారెడ్డి, కదంబురు రాజు వంటి వారు పదేళ్ల పాటు మంత్రులుగా పని చేశారు. స్టాలిక్ మంత్రి వ‌ర్గంలో కీల‌క శాఖ‌లు ద‌క్కించుకున్న తెలుగు వారు.. కేకేఎస్ రామచంద్రన్ - అరుప్పుకొట్టై ఎమ్మెల్యే. కీలకమైన రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు.ఏ వేలు - తిరువణ్ణామలై నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఈయ‌న పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆర్ గాంధీ - రాణిపేట నియోజకవర్గంలో పోటీచేసి విజ‌యంసాధించారు. గాంధీకి టెక్స్ టైల్ శాఖ మంత్రిగా నియమించారు. దేవాదాయశాఖ మంత్రిగా పీకే శేఖర్ బాబు (చెన్నై దురైముగం నియోజకవర్గం)..తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గం నుంచి విజ‌యం సాధించిన‌ కేఎన్ నెహ్రూ మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

గతంలో సీఎంలుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, పళనిస్వామి, పన్నీర్ సెల్వం అందరూ తమ కేబినెట్లో తెలుగువారికి ప్రాతినిధ్యాన్ని కల్పించారు. స్టాలిన్ కూడా అదే ఒరవడిని కొనసాగించారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. అందుకే ఆయా ప్రాంతాల్లో అన్ని పార్టీలు తెలుగువారికి టికెట్లు ఇస్తుంటాయి. తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల ద్వారా గెలుపొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories