వారంలో రెండో తుపాను : బురేవి టెన్షన్..ఐఎండీ రెడ్ అలర్ట్

వారంలో రెండో తుపాను : బురేవి టెన్షన్..ఐఎండీ రెడ్ అలర్ట్
x
Highlights

నివర్ తుఫాన్ చేసిన గాయం మానకముందే మరో తుఫాన్ దాడి చేసేందుకు దూసుకస్తోంది. ఇప్పటికే బురేవీ తుఫాన్ బంగాళాఖాతంలో పురుడుపోసుకుంది. బంగాళాఖాతంలో...

నివర్ తుఫాన్ చేసిన గాయం మానకముందే మరో తుఫాన్ దాడి చేసేందుకు దూసుకస్తోంది. ఇప్పటికే బురేవీ తుఫాన్ బంగాళాఖాతంలో పురుడుపోసుకుంది. బంగాళాఖాతంలో ఆగ్నేయదిశగా ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపాన్ని దాల్చింది. క్రమంగా అది వాయుగుండంగా మారనుంది. ఈ రాత్రికి కన్యాకుమారి, పంబన్ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వాయుగుండం తిరిగి తుఫాన్‌ గా మారితే తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో కుండపోత వర్షం తప్పదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

తుఫాన్‌గా ఆవిర్భవించిన అనంతరం అది క్రమంగా తమిళనాడు దక్షిణ ప్రాంతం వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ఫలితంగా తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 48 గంటల పాటు దాని తీవ్రత కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సైతం భారీగా పడిపోతుందని చెబుతున్నారు. ఇప్పటికే కన్యాకుమారి, రానాథపురం, తూత్తుకుడి, తిరుసల్వేలిలో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. 48 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తూత్తుకుడి విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను కూడా రద్దు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories