Setback for Adani Group: అదానీకి షాకిచ్చిన తమిళనాడు సర్కారు

Setback for Adani Group: అదానీకి షాకిచ్చిన తమిళనాడు సర్కారు
x
Highlights

Tamil Nadu MK Stalin govt cancelled Adani Group's tender for smart meters: తమిళనాడు సర్కారు విద్యుత్ కనెక్షన్స్ కోసం అవసరమైన స్మార్ట్ మీటర్స్ సరఫరా కోసం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (AESL) టెండర్స్ దాఖలు చేసింది.

Tamil Nadu MK Stalin govt cancelled Adani Group's tender for smart meters: గౌతం అదానీకి తమిళనాడు సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. గతేడాది ఆగస్టులో తమిళనాడు సర్కారు విద్యుత్ కనెక్షన్స్ కు అవసరమైన స్మార్ట్ మీటర్స్ సరఫరా కోసం టెండర్స్ పిలిచింది. అందులో నాలుగు టెండర్లు ఓకే చేసింది. ఆ నాలుగింటిలో అదానీకి చెందిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (AESL) కూడా ఒకటి.

ఈ టెండర్ అగ్రిమెంట్ ప్రకారం తమిళనాడులోని 82 లక్షల విద్యుత్ కనెక్షన్స్ కు అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్స్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ అదానీతో ఓకే చేసుకున్న ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా తమిళనాడు సర్కార్ ప్రకటించింది. ఒక్క అదానీతో ఒప్పందమే కాకుండా గతేడాది చేసుకున్న నాలుగు టెండర్లను రద్దు చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తమ ప్రకటనలో పేర్కొంది.

వాస్తవానికి అప్పుడు దాఖలైన టెండర్లలో గౌతం అదానీ కంపెనీయే తక్కువ ధరలో స్మార్ట్ మీటర్లు సరఫరా చేసేందుకు కోట్ చేసింది. కానీ ఆ ధర ఎక్కువగా ఉన్నందునే ఆ టెండర్స్ రద్దు చేస్తున్నామని తాజాగా స్టాలిన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ఈ వార్త అప్‌డేట్ అవుతోంది గమనించగలరు.

Show Full Article
Print Article
Next Story
More Stories