Senthil Balaji: తమిళనాడు మంత్రిని అరెస్ట్‌ చేసిన ఈడీ.. కుప్పకూలిన బాలాజీ

Tamil Nadu Minister Senthil Balaji Arrested in Money Laundering Case
x

Senthil Balaji: తమిళనాడు మంత్రిని అరెస్ట్‌ చేసిన ఈడీ.. కుప్పకూలిన బాలాజీ

Highlights

Senthil Balaji: మంత్రి అధికారిక నివాసంలో విచారణ అనంతరం ఘటన

Senthil Balaji: త‌మిళ‌నాడు విద్యుత్తు శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీని ఈడీ కస్టడీలోకి తీసుకుంది. మనీ లాండరింగ్ కేసులో సోదాలు జరిపిన అనంతరం మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బాలాజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు ఈడీ అధికారులు. మంత్రిని అదుపులోకి తీసుకునే సమయంలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.బాలాజీ గతంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్నారు. ఆయనపై ఉద్యోగాల విషయంలో ఆరోప‌ణ‌లు వచ్చాయి. లంచం తీసుకుని ఉద్యోగాలు ఇప్పించిన‌ట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈడీ విచార‌ణ‌కు గ‌తంలో అనుమ‌తి ఇచ్చింది. దీంతో మ‌నీల్యాండ‌రింగ్ కేసులో మంగళవారం ఈడీ మంత్రి బాలాజీతో పాటూ మ‌రికొంత మంది ఇళ్లలో సోదాలు నిర్వహించింది.

సచివాలయంలో ఉన్న మంత్రి బాలాజీ ఆఫీసు రూమ్‌లో కూడా త‌నిఖీలు జరిగాయి.తాను ఏ విచారణకైనా సిద్ధమని.. పూర్తి సహకారం అందిస్తానని మంత్రి బాలాజీ అన్నారు. అలాంటప్పుడు సచివాలయంలో ఉన్న మంత్రి అధికారిక ఛాంబర్స్‌పై ఈడీ దాడులు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని డీఎంకే కూడా మండిపడుతోంది. హోం మంత్రి అమిత్‌షా చెన్నై వచ్చి వెళ్లిన వెంటనే ఈ దాడులు జరపడంలో ఉద్దేశం ఏంటని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న బెదిరింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.రాజకీయంగా ఎదుర్కొలేక ప్రత్యర్థి పార్టీలపై కేంద్రం దర్యాప్తు సంస్థలతో కక్ష సాధిస్తోందన్నారు స్టాలిన్.

దర్యాప్తు సంస్థలతో రాజకీయ ప్రత్యర్థులను తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. అధికారం కోల్పోతామనే భయంతోనే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని.. కేంద్రం బెదిరింపులకు భయపడేదిలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారన్నారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినా ఇలా మంత్రి ఆఫీసులో సోదాలు చేయడం సరికాదన్నారు.తమిళనాడు మంత్రి బాలాజీ ఇళ్లు, ఆఫీసులో ఈడీ సోదాలు చేసింది. అనంతరం ఇవాళ అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈడీ దాడులు రాజకీయంగా కక్షసాధింపు అంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేయిస్తోందని.. ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్న సంగతి మర్చిపోకూడదు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories