Heavy Rainfall: భారీ వర్షాలు కారణంగా అక్కడి స్కూల్స్, కాలేజీలకు సెలవులు

Rain Alert
x

Rain Alert: నేడు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం..మూడు రోజులపాటు భారీ వర్షాలు

Highlights

Tamil Nadu govt declared holidays for schools and colleges due to heavy rains: తమిళనాడులో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా...

Tamil Nadu govt declared holidays for schools and colleges due to heavy rains: తమిళనాడులో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీరప్రాంతాల్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ వారం మొత్తం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

వాతావరణ శాఖ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు సర్కారు ముందే అప్రమత్తం అయింది. యెల్లో అలెర్ట్ జారీ అయిన జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

చెన్నై సహా మయిలదురుతై, కరైజల్, కడలూర్, అరియలూర్, పెరంబళూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేట్, కన్యాకుమారి, తిరునల్వెలి, తూతుక్కుడి, టెంకాసి, రామంతపురం, విరుధునగర్, మధురై జిల్లాలకు కూడా చెన్నై వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీచేసింది.

మొత్తంగా ఈ వారం పొడవునా తమిళనాడులోని 15 కు పైగా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ నుండి కురుస్తోన్న భారీ వర్షాలతో చెన్నైలో ఇప్పటికే 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఎప్పటికంటే 1 శాతం ఎక్కువని సంబంధిత అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories