తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

Tamil Nadu Governor RN Ravi Walks out of Assembly
x

తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

Highlights

తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ RN రవి వాకౌట్ చేశారు. స్టాలిన్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్.. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగం తప్ప మిగతా భాగాన్ని స్పీకర్ తొలగించాలని కోరారు. గవర్నర్ జోడించిన అంశాలను రికార్డుల్లోంచి తీసేయాలని సూచించారు. ఈ మేరకు స్టాలిన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం గవర్నర్ ఒరిజినల్ ప్రసంగాన్ని మాత్రమే రికార్డ్ చేయాలనే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ RN రవి జాతీయ గీతం పూర్తయ్యే వరకు కూడా వేచి ఉండకుండా.. కొద్ది క్షణాల తర్వాత ఆలపిస్తూ మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడును శాంతి కాముక రాష్ట్రంగా అభివర్ణిస్తూ లౌకికవాదం, పెరియార్, బీఆర్ అంబేద్కర్, కామరాజ్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి నేతల ప్రస్తావనలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రసంగం రూపొందించింది. ఆ ప్రసంగంలో కొన్ని భాగాలను గవర్నర్ దాటవేయడం వివాదాస్పదమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories