ఏడు గంటలు హింస.. గోడలపై రక్తం

ఏడు గంటలు హింస.. గోడలపై రక్తం
x
Highlights

తమిళనాడులో తండ్రి, కుమారుల కస్టడీ మరణాలకు సంబంధించి సీబీఐ కీలక విషయాలు బయటపెట్టింది. ఈ కేసులో తూత్తుకుడికి చెందిన వ్యాపారులు జయరాజ్‌, ఆయన కుమారుడు...

తమిళనాడులో తండ్రి, కుమారుల కస్టడీ మరణాలకు సంబంధించి సీబీఐ కీలక విషయాలు బయటపెట్టింది. ఈ కేసులో తూత్తుకుడికి చెందిన వ్యాపారులు జయరాజ్‌, ఆయన కుమారుడు బెన్నిక్స్‌లను పోలీసులు ఆరు గంటలకు పైగా హింసించినట్టు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఆ గది గోడలపై రక్తం మరకలు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో తెలిసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి 15 నిమిషాలు ఎక్కువగా మొబైల్ షాప్ తెరిచి ఉంచారని జయరాజ్‌, ఆయన కుమారుడు బెన్నిక్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జూన్‌ 22న తీవ్ర గాయాల కారణంగా గంటల వ్యవధిలోనే ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన తమిళనాడువ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ కేసులో నిందితులైన పోలీసులు జూన్‌ 19 రాత్రి 8 గంటల నుంచి దాదాపు ఏడు గంటల పాటు తండ్రీకొడుకులను క్రూరంగా హింసించారని సీబీఐ తన ఛార్జిషీటులో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిందిన రక్తాన్ని వారి దుస్తులతోనే శుభ్రం చేయించినట్టు వివరించింది. నిజానికి ఆ వ్యాపారులు లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించనేలేదని పోలీసులు తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు వారిపై తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారని తమ విచారణలో తేలినట్టు సీబీఐ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories