Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్‌

Tamil Nadu BSP chief Armstrong murder accused encounter
x

Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్‌

Highlights

Tamil Nadu: పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన తిరువెంకటం

Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు ప్రధాన నిందితుడు తిరువెంకటం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. కస్టడీ నుంచి పారిపోయే క్రమంలో పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు తిరువెంకటం. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావమై తిరువెంకటం చనిపోయాడు. విచారణలో భాగంగా ఓ ప్రాంతంలో దాచిపెట్టిన ఆయుధాలను గుర్తించేందుకు తిరువెంకటాన్ని నార్త్ చెన్నైలోని ఓ ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న నిందితుడు కూరగాయాల మార్కెట్‌లోని ఓ షెడ్‌లో దాక్కున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరగపడంతో.. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఐదు రోజుల క్రితమే నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించింది కోర్టు. జులై 5న ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య జరగగా.. ఈ కేసులో మొత్తం 11 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories