తమిళనాడుకు చెందిన లక్ష్మీ సాయిశ్రీ అనే బాలిక, కేవలం 58 నిమిషాల్లో 46 రకాల వంటకాలను వండటం ద్వారా యూనికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం...
తమిళనాడుకు చెందిన లక్ష్మీ సాయిశ్రీ అనే బాలిక, కేవలం 58 నిమిషాల్లో 46 రకాల వంటకాలను వండటం ద్వారా యూనికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. లక్ష్మి, వంటలు వండటంలో అద్భుత ప్రతిభ కనబరిచిందని యూనికో ప్రతినిధులు తెలిపారు. తన కూతురు లాక్ డౌన్ సమయంలో వంటలు వండటం నేర్చుకుందని, ఆమె వేగాన్ని, ప్రతిభను చూసిన తండ్రి వరల్డ్ రికార్డు కోసం కృషి చేయాలని ప్రోత్సహించారని లక్ష్మి తల్లి వెల్లడించారు.
తనకు వరల్డ్ రికార్డు దక్కడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన లక్ష్మి, తానిప్పుడు వివిధ రకాల తమిళ సంప్రదాయ వంటకాలను చేయగలనని, వంటగదిలో తల్లితో గడిపిన రోజులు తనకు వంటకాల్లో అనుభవాన్ని పెంచాయని చెప్పింది. గతంలో కేరళకు చెందిన పదేళ్ల శాన్వి అనే బాలిక, 30 రకాల వంటకాలను గంట వ్యవధిలో వండి రికార్డు సృష్టించగా, ఇప్పుడు ఆ రికార్డును లక్ష్మి అధిగమించింది.
Tamil Nadu: A girl entered UNICO Book Of World Records by cooking 46 dishes in 58 minutes in Chennai yesterday. SN Lakshmi Sai Sri said, "I learnt cooking from my mother. I am very happy". pic.twitter.com/AmZ60HWvYX
— ANI (@ANI) December 15, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire