కపుల్ ఛాలెంజ్ లో ఫోటోలు వేస్తున్నారా.. జర భద్రం..ఎందుకో తెలుసా?

కపుల్ ఛాలెంజ్ లో ఫోటోలు వేస్తున్నారా.. జర భద్రం..ఎందుకో తెలుసా?
x
Highlights

గతంలో టెన్‌ ఇయర్స్‌ ఛాలెంజ్‌, ఆ తర్వాత శారీ ఛాలెంజ్, ఇప్పుడు కపుల్ ఛాలెంజ్‌. ఇలా ఏదో ఓ కొత్త ఛాలెంజ్‌ సోష‌ల్‌ మీడియాను ఊపేస్తుంటాయి. ఇలా ఈ మధ్య...

గతంలో టెన్‌ ఇయర్స్‌ ఛాలెంజ్‌, ఆ తర్వాత శారీ ఛాలెంజ్, ఇప్పుడు కపుల్ ఛాలెంజ్‌. ఇలా ఏదో ఓ కొత్త ఛాలెంజ్‌ సోష‌ల్‌ మీడియాను ఊపేస్తుంటాయి. ఇలా ఈ మధ్య ట్రెండీగా మారింది కపుల్‌ ఛాలెంజ్‌ ఒకరికి మించి మరొకరు మేమేం తక్కువ కాదంటూ పోటీ పడి మరీ ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ ఫోటోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. కానీ ఈ అత్యుత్సాహానికి బ్రేకులు వేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటున్నారు పోలీసులు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఛాలెంజ్‌లతో రిస్క్‌ తప్పదంటున్నారు నిపుణులు. సేఫ్టీ లేని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.

కొత్త ఛాలెంజ్‌లతో యూజర్లను మురిపించే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో ఇప్పుడు కపుల్‌ ఛాలెంజ్‌ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో విపరీతంగా ట్రెండ్‌ అయిన ఈ ఛాలెంజ్‌లో ఫోటోలు పోస్టు చేసే ధోరణి పెరిగిపోయింది. అయితే వ్యక్తిగత ఫోటోలను ఇలా ఛాలెంజ్‌ల పేరుతో బయటపెడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు పోలీసులు. మహిళల ఫోటోలను మిస్‌యూజ్‌ చేసే ప్రమాదం ఉండటంతో ఛాలెంజ్‌లతో తస్మాత్‌ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. గతంలో యూఎస్‌ మాజీ ప్రెసిడెంట్‌ భార్య మిషెల్‌ ఒబామా ఫేస్‌ను మార్ఫ్‌ చేసి రిలీజ్ చేశారు కేటుగాళ్లు. ఇలా ఎంతో మంది బాధితులు ఫిర్యాదులతో స్టేషన్ల గడప తొక్కుతున్నారని యువత అత్యుత్సాహం మాని కేర్‌ఫు‌‌ల్‌గా ఉండాలంటున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories