Supreme Court: రేపు సాయంత్రం 5లోపు విధుల్లో చేరాలి.. నిరసన చేస్తున్న బెంగాల్ డాక్టర్లకు సుప్రీంకోర్టు అల్టిమేటమ్

Supreme Court warns junior doctors protesting R G Kar rape-murder
x

Supreme Court: రేపు సాయంత్రం 5లోపు విధుల్లో చేరాలి.. 

Highlights

Supreme Court: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5గంటల్లోపు తిరిగి విధుల్లో చేరాలని...

Supreme Court: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5గంటల్లోపు తిరిగి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేకపోతే ప్రతికూల చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. హత్యాచారం కేసుపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

పశ్చిమ బెంగాల్‌లో 28రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బెంగాల్‌ డాక్టర్లు తమ నిరసన విరమించాలని చంద్రచూడ్ మరోసారి కోరారు. ఈ సందర్భంగా వారి భద్రతకు హామీ ఉంటుందన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు వైద్యులు విధుల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వైద్యులు విధుల్లోకి రాకపోతే.. వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories