ఢిల్లీలో కూల్చివేతలపై విచారణ రెండు వారాలకు వాయిదా...

Supreme Court Stay on Demolishing Illegal Buildings | Live News Today
x

ఢిల్లీలో కూల్చివేతలపై విచారణ రెండు వారాలకు వాయిదా...

Highlights

Delhi News: ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తామని వెల్లడి...

Delhi News: జహింగీర్‌పురి అక్రమ కట్టడాల కూల్చివేతలపై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. అప్పటివరకు కూల్చివేతలను చేపట్టొద్దని.. అక్కడ యథా స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు(Supreme Court) మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. స్టే ఉత్తర్వులు ఇచ్చినా రెండు గంటల పాటు కూల్చివేతలను కొనసాగించడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తామని తెలిపింది. ఒక వర్గాన్ని టార్గెట్‌ చేసుకుని.. కూల్చివేతలు ప్రారంభించినట్టు పటిషనర్ల తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే వాదించారు.

యూపీ(Uttar Pradesh), మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కే పరిమితమైన ఓ వర్గం ప్రజల ఇళ్ల కూల్చివేతలు ఇప్పుడు ఢిల్లీ(Delhi)కి చేరినట్టు ఆరోపించారు. బీజేపీ నాయకుడి కోరికను మున్సిపాలిటీ ఆదేశాలు తీసుకుని కూల్చివేతలకు దిగినట్టు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే సాధారణ కూల్చివేతల్లో భాగంగానే జహింగీర్‌పురిలో కూడా మున్సిపల్‌ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి కూల్చివేతలు నాలుగు సార్లు జరిగిందని... జహింగీర్‌పురి ఐదోదని తెలిపారు. అయితే సోలిసిటర్‌ జనరల్‌ వ్యాఖ్యలపై దుష్యంత్‌ దవే అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఢిల్లీలోని 731 అనధికారిక కాలనీలు ఉన్నాయని.. వాటిలో 15 లక్షల మంది జీవిస్తున్నారని దవే తెలిపారు. వాటన్నింటిని వదిలేసి.. కేవలం జహింగీర్‌పురి ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకోవడమేమిటని ప్రశ్నించారు. ముస్లింల ఇళ్ల కూల్చివేతలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం... తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు యథా స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాలకు కేసును వాయిదా వేస్తూ.. తాజా ఉత్తర్వులను సుప్రీంకోర్టు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories