Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కేంద్రానికి గట్టి షాక్‌..

Supreme Court Sensational Judgment About Law And Orders
x

Supreme Court: లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కేవలం లా అండ్‌ ఆర్డర్‌, పోలీసు.. భూమికి సంబంధించిన అంశాలపైనే అధికారం

Highlights

Supreme Court: నియంత్రణ చేసే అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనన్న సుప్రీంకోర్టు

Supreme Court: దేశ రాజధాని దిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి గట్టి షాక్‌ తగిలింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉండాలని స్పష్టం చేసింది. దిల్లీ సర్కారుకు అధికారాలు లేవన్న గత తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్‌ జనరల్‌ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories