నీట్‌, జేఈఈ పరీక్షలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌

నీట్‌, జేఈఈ పరీక్షలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌
x
Highlights

నీట్, జేఈఈ పరీక్షలను రద్దు చేయాలనీ దాఖలు చేసిన ఆరు రాష్ట్రాల పున పరిశీలన పిటిషన్‌ను..

నీట్, జేఈఈ పరీక్షలను రద్దు చేయాలనీ దాఖలు చేసిన ఆరు రాష్ట్రాల పున పరిశీలన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో ఈ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమం అయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లు జరుగుతాయని ముగ్గురు న్యాయమూర్తుల‌తో కూడిన ధ‌ర్మ‌సనం తెలిపింది. కాగా విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించాలంటూ ఆగస్టు 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆగస్టు 28 న ఆరు రాష్ట్రాల క్యాబినెట్ మంత్రులు సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్రాల్లో పంజాబ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ ,మహారాష్ట్ర ఉన్నాయి.

దేశవ్యాప్తంగా అంటువ్యాధి మరియు అనేక రాష్ట్రాల్లో వరదలు ఉన్నందున, విద్యార్థులు, తల్లిదండ్రులు, అనేక విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో, నిరసనలు ఉన్నప్పటికీ, కరోనా నుండి రక్షించడానికి అవసరమైన మార్గదర్శకాలతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) సెప్టెంబర్ 1 నుండి జేఈఈ మెయిన్‌ను ప్రారంభించింది. ఇది సెప్టెంబర్ 6 వరకు నడుస్తుంది. మరోవైపు, వైద్య ప్రవేశానికి నీట్ పరీక్ష సెప్టెంబర్ 13 న జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories