Supreme Court: బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court Pauses Bulldozer Justice
x

Supreme Court: బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Highlights

Supreme Court: బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Supreme Court: బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అక్టోబర్ 1వ తేదీ వరకు బుల్డోజర్ యాక్షన్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను చట్టవిరుద్ధంగా కూల్చివేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

పిటిషనర్ల తరపున వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కూల్చివేత ఒకసారి జరిగినా.. వందసార్లు జరిగినా రాజ్యాంగ ధర్మానికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే మాత్రం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. రైల్వే లైన్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్లు, చెరువులను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories